Bengaluru Stampede: ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన RCB జట్టు విజయోత్సవాల్లో చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. మృతుల పేర్లు, వివరాలను అధికారులు వెల్లడించారు.

Bengaluru Stampede:: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన వేడుకల్లో చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. ఆసుపత్రుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, మృతుల పేర్లు, వయసు, గాయపడిన వారి వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 11 మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

వైదేహి ఆసుపత్రిలో నగులురు మృతి

  • భూమిక – 20 ఏళ్లు
  • సహనా – 19 ఏళ్లు
  • 20 ఏళ్ల యువకుడు
  • 35 ఏళ్ల వ్యక్తి
  • ఇక్కడ ఇంకా 12 మందికి చికిత్స అందిస్తున్నారు.

మణిపాల్ ఆసుపత్రిలో ఒకరు మృతి

  • చిన్మయి – 19 ఏళ్లు
  • ఈ ఆసుపత్రిలో ఇంకా ఆరుగురు చికిత్స పొందుతున్నారు. 

బౌరింగ్ ఆసుపత్రిలో ఆరుగురు మృతి

  • దివ్యాంశి – 13 ఏళ్ల బాలిక
  • దియా – 26 ఏళ్ల యువతి
  • శ్రవణ్ – 21 ఏళ్ల యువకుడు
  • గుర్తు తెలియని బాలిక
  • 17 ఏళ్ల గుర్తు తెలియని యువకుడు
  • గుర్తు తెలియని వ్యక్తి, వయసు, పేరు తెలియలేదు.

బౌరింగ్ ఆసుపత్రిలో నిధి, రక్షిత, హీనా, శ్యామిలి, అనుజ్ తీవ్రంగా గాయపడ్డ వారు చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.

  • మొత్తం మరణాలు: 11
  • తీవ్రంగా గాయపడినవారు: 12+6+5 = 23+ మంది
  • దుర్ఘటనకు కారణం: గేట్ల దగ్గర రద్దీతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట

RCB వేడుకలు, ప్రభుత్వ నిర్లక్ష్యం

RCB జట్టు సన్మానానికి ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడం, జనం నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.

ఊపిరి ఆడక చనిపోయారు

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో వైదేహి ఆసుపత్రికి 16 మందిని తీసుకొచ్చారు. వీరిలో నలుగురు ఊపిరి ఆడక చనిపోయారు. మిగతా 10 మందికి చికిత్స అందిస్తున్నారు, వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇంకొకరికి చిన్న గాయాలయ్యాయి, చికిత్స చేసి పంపించేశారు అని వైద్యురాలు డాక్టర్ హుమేరా చెప్పారు.