Vida Z: హీరో కంపెనీ విడా Z అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని మార్కెట్లోకి తీసుకొస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇలాంటి బెస్ట్ ఫీచర్లు ఏమున్నాయో తెలుసుకుందాం రండి. 

ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకుల మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొంది. దీన్ని ఎదుర్కోవడానికి హీరో కంపెనీ విడా Z పేరుతో కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది Vida VX2 పేరుతో కూడా అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ Vida V2 మోడల్ కంటే చవకగా, మంచి ఫీచర్స్‌తో తయారైంది. 

విడా Z స్కూటర్ ధర దాదాపు రూ.1 లక్ష

విడా Z స్కూటర్ ధర సుమారుగా రూ.1 లక్ష ఉంటుందని అంచనా. ఇది విడా V2 కంటే తక్కువ. ప్రస్తుతం విడా V2 రూ.96,000 నుండి లభిస్తోంది. కొత్త విడా Z, ఈ తరం జీవనశైలికి తగ్గట్టుగా, సింపుల్‌గా, ఫ్యామిలీ లుక్‌ ఉండేలా డిజైన్ చేశారు. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. బ్యాటరీ తీసి ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ కెపాసిటీ 2.2kWh నుండి 4.4kWh వరకు ఉంటుంది.

విడా Z స్కూటర్ ఫీచర్స్ అదుర్స్

ఇందులో మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ను వాడారు. దీనివల్ల ఈ స్కూటర్ మంచి పనితీరు కనబరుస్తుంది. నమ్మకమైన రైడ్ ఇస్తుంది. మధ్యలో ఎక్కడా ఆగిపోవడం లాంటి సమస్యలు రావు. 

ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో హీరో ఏ స్థానంలో ఉందంటే..

ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో హీరో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 21% వృద్ధితో EV మార్కెట్ 1.15 మిలియన్ వాహనాలను దాటింది. మే నెలలో బజాజ్ ఆటో 21,770 యూనిట్లు అమ్మి ముందుంది. టీవీఎస్ 19,736 యూనిట్లతో రెండో స్థానంలో ఉంది. ఓలా అమ్మకాలు తగ్గి 18,499 యూనిట్లకు పడిపోయాయి. ఇది గత సంవత్సరం కంటే 51% తక్కువ.

వాహన మార్కెట్లో పోటీ 

విడా Z మోడల్ ధర, ఫీచర్స్ కస్టమర్లను ఆకర్షించేలా ఉన్నాయి. టీవీఎస్, బజాజ్, ఓలా ఎలక్ట్రిక్ లాంటి కంపెనీలకు హీరో గట్టి పోటీ ఇస్తుందని నిపుణుల అంచనా. 

విడా Z స్కూటర్ జూలై 1, 2025 నుండి అమ్మకానికి వస్తుంది. ఫ్యామిలీకి, బడ్జెట్‌కి తగ్గ ధరతో, నమ్మకమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా హీరో అమ్మకాలను పెంచుతుందని కంపెనీ భావిస్తోంది.