ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కలకలం మొదలయ్యింది. మన దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలుగు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి న్యూడిల్లీలో ఉన్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
12:21 AM (IST) May 25
Mohammed Shami: ఇంగ్లాండ్ పర్యటన కోసం ప్రకటించిన భారత టెస్టు జట్టులో టీమిండియా సీనియర్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీకి చోటుదక్కలేదు. ఈ నిర్ణయం వెనుక కారణాలను బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియాకు వివరించారు.
12:14 AM (IST) May 25
Tata Altroz: టాటా కంపనీ కొత్త ఫీచర్లతో తన ‘ఆల్ట్రోజ్’ మోడల్ కారుని గురువారం విడుదల చేసింది. ముంబైలోని పోవైలో జరిగిన కార్యక్రమంలో కొత్త ఆల్ట్రోజ్ కారును లాంచ్ చేశారు. ఈ కారు ఫీచర్లు, ధర, మైలేజ్ తదితర వివరాలు తెలుసుకుందాం రండి.
11:47 PM (IST) May 24
IPL 2025 PBKS vs DC: ఐపీఎల్ 2025లో టాప్ ప్లేస్ కోసం చూస్తున్న పంజాబ్ కింగ్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ బిగ్ షాక్ ఇచ్చింది. చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది.
11:19 PM (IST) May 24
Sai Sudharsan: దేశవాళీ క్రికెట్ తో పాటు ప్రస్తుతం ఐపీఎల్ లో సూపర్ బ్యాటింగ్ తో అదరగొడుతున్న సాయి సుదర్శన్ భారత టెస్టు జట్టులోకి వచ్చాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ ఐపీఎల్ లో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.
10:45 PM (IST) May 24
India Pakistan Tensions: పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తూ సున్నితమైన సమాచారం పంపించాడనే ఆరోపణలపై కచ్‌లో ఒక ఆరోగ్య కార్యకర్తను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది.
10:26 PM (IST) May 24
మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకున్న మిల్లా మాగీ సంచలన ఆరోపణలు చేశారు. ఇండియాలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు తనని అసభ్యంగా ఫీల్ అయ్యేలా చేశాయని ఆరోపించింది.
10:20 PM (IST) May 24
Kohli Rohit Test Retirement Agarkar Comments: టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
09:57 PM (IST) May 24
Flipkart: మార్కెట్ లో కొన్ని వస్తువులు చాలా కాస్ట్ లీగా ఉంటాయి. వాటి ధర చూస్తే వామ్మో.. మనం కొనలేం లే అనిపిస్తుంది. కాని అవే వస్తువులు ఫ్లిప్ కార్ట్ లో కేవలం రూ.99 లకే లభిస్తాయంటే మీరు నమ్మగలరా? అవేంటో ఇప్పుడు చూద్దాం.
09:36 PM (IST) May 24
Shreyas Iyer: ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే, ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ కు జట్టులో ఎందుకు చోటుదక్కలేదు?
08:51 PM (IST) May 24
Telugu language in Punjab schools: కేంద్ర ప్రభుత్వ 'ఏక భారత్ శ్రేష్ఠ భారత్' పథకం కింద, పంజాబ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాష బోధనకు ఏర్పాట్లు చేస్తున్నట్టు విద్యా శాఖ తెలిపింది. అయితే, దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
08:06 PM (IST) May 24
Google I/O 2025: గూగుల్ తన డెవలపర్ సమావేశమైన Google I/O 2025లో కొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. 3D వీడియో కాల్స్ కోసం Google Beam, AI వీడియో క్రియేషన్ కోసం veo3, AI ఆధారిత Search Live ఇంటిగ్రేషన్ వంటి ఎన్నో ప్రకటనలు చేసింది.
07:34 PM (IST) May 24
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరచిపోయినట్లున్నారు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం కామెంట్స్ చేసింది.
06:26 PM (IST) May 24
Justice BV Nagarathna: జస్టిస్ బీవీ నాగరత్న మే 25న సుప్రీంకోర్టు కోలీజియంలో చేరనున్నారు. దీంతో భారత న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఎందుకుంటే, ఆమె 2027లో తొలి మహిళా సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు.
05:54 PM (IST) May 24
Flipkart: మీరు ఫ్లిప్‌కార్ట్ లో ఏదైనా కొనేటప్పుడు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నారా? అయితే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ క్రెడిట్ కార్డు వినియోగంలో కొన్ని కీలక మార్పులు చేశారు. అవేంటో వివరంగా తెలుసుకుందాం రండి.
05:51 PM (IST) May 24
1xGames Crash: నాగపూర్‌కు చెందిన 34 ఏళ్ల ఎలక్ట్రీషియన్ రవీందర్, తన జీవితం సాధాారణంగా సాగుతుండగా, 1xBet ప్లాట్‌ఫామ్‌లో 1xGames Crash గేమ్ ఆడి రూ. 20 లక్షల రూపాయలు గెలిచి సంచలనంగా నిలిచారు.
05:18 PM (IST) May 24
BJP: ఇప్పుడు ఎన్నికలు జరిగితే కర్ణాటకలో బీజేపీ 136-159 సీట్లతో పూర్తి మెజారిటీ సాధిస్తుందని తాజా సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ 62-82 సీట్లతో, జేడీ(ఎస్) 3-6 సీట్లను మాత్రమే గెలుచుకుంటాయని సర్వే పేర్కొంది.
04:47 PM (IST) May 24
Niti Aayog meet: నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రధాని మోడీ "వికసిత్ భారత్@2047" లక్ష్యంపై దృష్టిసారించి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా పని చేయాలన్నారు.
03:37 PM (IST) May 24
ఇంగ్లాండ్ తో టెస్ట్ సీరిస్ కోసం భారత జట్టును ప్రకటించింది బిసిసిఐ. శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలో ఐదు టెస్టుల సీరిస్ ఆడనుంది టీమిండియా. బుమ్రా, కెఎల్ రాహుల్ కు కెప్టెన్సీ పగ్గాలు ఎందుకు అప్పగించలేదంట అంటే…
Rg
02:29 PM (IST) May 24
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసారు. ఎందుకోసం ఈ డిమాండ్ చేస్తున్నారంటే…
01:53 PM (IST) May 24
రోహిత్ శర్మ తర్వాత శుభ్‌మన్ గిల్ భారత టెస్ట్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. కోహ్లీ, అశ్విన్ వంటి కీలక ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత కొత్త నాయకత్వాన్ని ఎంపికచేసింది బిసిసిఐ.
01:46 PM (IST) May 24
ఈ ఏడాది కేవలం 5 నెలల్లోనే టెక్ ప్రపంచం ఒక్కసారిగా కుదేలైంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు 61,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి.
01:24 PM (IST) May 24
ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఇంటికి వచ్చే పాలు సాధారణమైనవి కావు. వీవీఐపీవి అని మీకు తెలుసా? ఈ పాల ప్రత్యేకత ఏమిటంటే, పాలు ఇచ్చే ఆవులు ఏసీలో ఉంటాయి, వాటికి ఆర్ఓ నీళ్ళు తాగిస్తారు.
01:00 PM (IST) May 24
గోల్డ్ రేట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మధ్యలో కాస్త తగ్గినా మళ్లీ రేట్లు పెరుగుతున్నాయి. ఈ రోజు అనగా మే 24, 2025న బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
12:40 PM (IST) May 24
ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు వచ్చిన నికర విదేశీ పెట్టుబడి కేవలం $353 మిలియన్లే, గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గిందని RBI వెల్లడించింది.
12:22 PM (IST) May 24
తక్కువ పెట్రోల్ కొట్టి బంకు సిబ్బంది మిమ్మల్ని మోసం చేశారా? లేదా ఉచితంగా డ్రింకింగ్ వాటర్ అడిగితే లేదని చెప్పారా? ఇలాంటప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలుసా? ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు తెలుసుకుందాం రండి.
12:20 PM (IST) May 24
బిఆర్ఎస్ పాార్టీలో అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరాయా? అంటే అవుననేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న కవిత, నేడు కేటీఆర్ ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నారు. దీంతో అసలు బిఆర్ఎస్ లో ఏం జరుగుతోందన్న చర్చ మొదలయ్యింది.
11:59 AM (IST) May 24
నటుడు ముకుల్ దేవ్ అనారోగ్యంతో ముంబయిలో మృతిచెందారు. తెలుగు సహా పలు భాషల్లో విలన్‌గా నటించిన ఆయన 2022 నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు.
11:49 AM (IST) May 24
చైనా పాక్‌కు మద్దతు ఇచ్చిందన్న నిఘా నివేదికలపై కేంద్రం స్పందన, భారత్-చైనా విమానాల పునఃప్రారంభంపై తిరిగి సమీక్ష.
11:13 AM (IST) May 24
2024-25లో కేంద్ర ప్రభుత్వానికి రూ.2.69 లక్షల కోట్లు మిగులు చెల్లింపుగా ఆమోదించిన ఆర్‌బీఐ, డివిడెండ్ చరిత్రలో ఇదే అత్యధికం.
11:07 AM (IST) May 24
తెలుగు రాష్ట్రాల్లొ ఉగ్రవాద కదలికలు బైటపడుతున్న నేపథ్యంలో విజయవాడలో బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది.
10:49 AM (IST) May 24
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ వైమానిక దళానికి రూ.28 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని CDF నివేదిక వెల్లడి చేసింది.
10:24 AM (IST) May 24
గత రెండు నెలలకు పైగా జైల్లోనే ఉండటంతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాడు. తాజాగా అతడు అనారోగ్యానికి గురయ్యాడు.
10:12 AM (IST) May 24
మయన్మార్ సముద్ర తీరంలో జరిగిన పడవ ప్రమాదాల్లో 427 మంది రోహింగ్యా ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు.
09:53 AM (IST) May 24
ఇంగ్లాండ్ సిరీస్ కోసం భారత టెస్ట్ ను జట్టు నేడు ప్రకటించనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత కొత్త కెప్టెన్, ఓపెనింగ్ జోడీ, బ్యాటింగ్ లైనప్‌తో కొత్త శకం ప్రారంభం కానుంది.
09:46 AM (IST) May 24
జర్మన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్‌లో జరిగిన చర్చలో, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవలి పహల్గాం ఉగ్రదాడి, భారతదేశం తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్, ముఖ్యంగా జర్మనీ నుండి అందుకున్న అంతర్జాతీయ మద్దతు గురించి మాట్లాడారు.
09:31 AM (IST) May 24
వేసవి సెలవులు ముగుస్తున్నాయని బాధ పడుతున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. వేసవి సెలవులు ముగిసినా జూన్ లో మరికొన్ని సెలవులు వస్తున్నాయి. ఆ సెలవుల లిస్ట్ ఇక్కడ చూద్దాం.
09:11 AM (IST) May 24
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి, పాక్ ఆర్మీని అల్లకల్లోలం చేసింది. ఆ సమయంలో పాక్ కమాండర్లు వారి పోస్టులను వదిలి పారిపోయినట్లు సమాచారం.
08:35 AM (IST) May 24
వేసవిలో పెట్ డాగ్స్ కి మనుషుల కంటే ఎక్కువ వేడిగా ఉంటుంది. ఈ చిట్కాలు వాటిని చల్లగా, సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి.
08:04 AM (IST) May 24
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇక ఈ నెలంతా ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది… అంటే ఇక ఎండాకాలం ముగిసినట్లే.
07:07 AM (IST) May 24
హైదరాబాద్ మెట్రో టికెట్లపై శనివారం నుంచి 10% రాయితీ అమల్లోకి వచ్చింది. ప్రయాణికులు మాత్రం అసలైన తగ్గింపు లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.