- Home
- Business
- Flipkart: మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? జూన్ 20 వరకే ఆ అవకాశం
Flipkart: మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? జూన్ 20 వరకే ఆ అవకాశం
Flipkart: మీరు ఫ్లిప్‌కార్ట్ లో ఏదైనా కొనేటప్పుడు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నారా? అయితే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ క్రెడిట్ కార్డు వినియోగంలో కొన్ని కీలక మార్పులు చేశారు. అవేంటో వివరంగా తెలుసుకుందాం రండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
జూన్ 20 నుండి అమల్లోకి కొత్త రూల్స్
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు త్వరలో కొన్ని కీలక మార్పులు జరగనున్నాయి. ఈ మార్పులు జూన్ 20, 2025 నుండి అమల్లోకి వస్తాయి. క్యాష్‌బ్యాక్ కార్డుల కేటగిరీలో ఈ క్రెడిట్ కార్డు చాలా పాపులర్. మైంట్రా, ఫ్లిప్‌కార్ట్, క్లియర్‌ట్రిప్ లాంటి ప్లాట్‌ఫామ్‌లపై షాపింగ్ చేసే వారికి ఇది మంచి ప్రయోజనం కలిగించే కార్డు.
మైంట్రా క్యాష్‌బ్యాక్ 7.5 % వరకు పెంపు
ఇప్పటివరకు మైంట్రా లో షాపింగ్ చేస్తే 1% మాత్రమే క్యాష్‌బ్యాక్ లభించేది. కానీ జూన్ 20 నుండి ఇది ఏకంగా 7.5 % అవుతుంది. మైంట్రా వినియోగదారులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. కానీ క్యాష్‌బ్యాక్‌కు కాపింగ్ ఉంది. ఒక్కో స్టేట్‌మెంట్ క్వార్టర్‌కు గరిష్టంగా రూ.4,000 క్యాష్ బ్యాక్ మాత్రమే లభిస్తుంది. స్టేట్‌మెంట్ క్వార్టర్ అంటే… మార్చి 16 నుంచి జూన్ 15 మధ్య కాలం. ఇలా జూన్ 16 - సెప్టెంబర్ 15, సెప్టెంబర్ 16 - డిసెంబర్ 15, డిసెంబర్ 16 - మార్చి 15 వరకు స్టేట్ మెంట్ క్వార్టర్స్ ఉంటాయి.
ఫ్లిప్‌కార్ట్, క్లియర్‌ట్రిప్ క్యాష్ బ్యాక్ పై కాపింగ్
ఫ్లిప్‌కార్ట్, క్లియర్‌ట్రిప్ పై 5% క్యాష్‌బ్యాక్ కొనసాగుతుంది. కానీ కొత్తగా కాపింగ్ అమలవుతుంది. ఒక్కో స్టేట్‌మెంట్ క్వార్టర్‌కు గరిష్టంగా రూ.4,000 క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుంది. ఇది ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్, క్లియర్ ట్రిప్ కి వర్తిస్తుంది. అంటే రెండు వేర్వేరు కాపింగ్స్ ఉంటాయన్న మాట.
లాంజ్ యాక్సెస్ రద్దు
ఇప్పటివరకు ఈ కార్డు ద్వారా ప్రతి సంవత్సరం 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ లభించేవి. అయితే ఇప్పుడు ఈ ప్రయోజనం పూర్తిగా తీసివేశారు. ఇది ఎక్కువ మంది ప్రయాణికులకు నిరాశ కలిగించేది విషయం.
క్యాష్ బ్యాక్ అర్హతల్లో మార్పు
ఇప్పటివరకు క్యాష్ బ్యాక్ ఎబిలిటీ MCC కోడ్ ఆధారంగా నిర్ణయించేవారు. ఇప్పుడు యాక్సెస్ బ్యాంక్ ఈ విధానాన్ని మార్చింది. ఇకపై ఖర్చుల కేటగిరీ ఆధారంగా క్యాష్ బ్యాక్ లభిస్తుందా? లేదా? అన్న విషయాన్ని నిర్ణయిస్తారు.
క్యాష్ బ్యాక్ రాని ఖర్చులు
విద్యుత్, టెలికాం బిల్లులు, విద్యా ఫీజులు, అద్దె చెల్లింపులు, వాలెట్ లోడ్‌లు, ప్రభుత్వ సేవలు, బీమా, బంగారం, ఆభరణాలు, ఫ్యూయల్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, క్యాష్ అడ్వాన్సెస్, క్రెడిట్ కార్డు బకాయిల చెల్లింపులు.
ఈ ఖర్చులు క్యాష్ బ్యాక్ లెక్కల్లోకి రావు. చివరిగా రూ.3,50,000 ఖర్చు చేస్తే వార్షిక ఫీజు కూడా మాఫీ అవుతుంది. ఈ మార్పులన్నీ జూన్ 20 నుంచి అమలవుతాయి.