Tata Altroz: కేవలం రూ.6.89 లక్షలకే కొత్త టాటా ఆల్ట్రోజ్: 50కి పైగా ఫీచర్లు
Tata Altroz: టాటా కంపనీ కొత్త ఫీచర్లతో తన ‘ఆల్ట్రోజ్’ మోడల్ కారుని గురువారం విడుదల చేసింది. ముంబైలోని పోవైలో జరిగిన కార్యక్రమంలో కొత్త ఆల్ట్రోజ్ కారును లాంచ్ చేశారు. ఈ కారు ఫీచర్లు, ధర, మైలేజ్ తదితర వివరాలు తెలుసుకుందాం రండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
5 సంవత్సరాలుగా ప్రజాదరణ
టాటా తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ కారుని కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేసింది. ముంబైలోని పోవైలో జరిగిన కార్యక్రమంలో కొత్త కారును లాంచ్ చేశారు. గత 5 సంవత్సరాలుగా ఆల్ట్రోజ్ ప్రజాదరణ పొందుతోంది. అందుకే 2025 వెర్షన్ ను తీసుకొచ్చారు. ఇది అత్యాధునిక డిజైన్, టెక్నాలజీ, పెర్ఫార్మెన్స్‌తో వస్తుంది. డ్రైవింగ్ అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుందని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.
కొత్త కారు ధర ఎంతంటే..
సామాన్యులు కూడా కారు కొనుగోలు చేయగలిగేలా టాటా కంపెనీ న్యానో కారును తయారు చేసింది. అయితే అది అంతగా జనానికి నచ్చలేదు. అందుకే టాటా కంపెనీ 2020 జనవరి 22న మొదటి ఆల్ట్రోజ్ కారును విడుదల చేసింది.
ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఆధునిక అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసింది. కొత్త ఆల్ట్రోజ్ ప్రారంభ ధర రూ.6.89 లక్షలు.
5 రంగుల్లో కొత్త కారు
ప్రిస్టీన్ వైట్, ప్యూర్ గ్రే, రాయల్ బ్లూ, ఎంబర్ గ్లో, డ్యూన్ గ్లో రంగుల్లో లభిస్తుంది. జూన్ 2 నుండి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. పెట్రోల్, డీజిల్, CNG వేరియంట్లలో లభించే ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్, కొత్త 5-స్పీడ్ AMT, 6-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌లు కలిగి ఉంది.
కొత్త ఆల్ట్రోజ్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు
కారులో సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు భద్రత కూడా ముఖ్యం. కొత్త ఆల్ట్రోజ్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో 5-స్టార్ రేటింగ్ పొందింది. 360 డిగ్రీ కెమెరా వ్యవస్థ కూడా ఉంది.
కొత్త ఆల్ట్రోజ్ డిజైన్‌లో టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. భారతదేశం, బ్రిటన్, ఇటలీలోని టాటా డిజైన్ స్టూడియో సిబ్బంది వర్చువల్ రియాలిటీ ద్వారా కలిసి పనిచేసి దీన్ని డిజైన్ చేశారు.
50కి పైగా కొత్త ఫీచర్లు
కొత్త ఆల్ట్రోజ్‌లో రెండు LED స్క్రీన్లు ఉన్నాయి. ఒకటి డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, మరొకటి 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్, 90-డిగ్రీ ఓపెనింగ్ డోర్లు, వాయిస్ యాక్టివేటెడ్ సన్‌రూఫ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, లగ్జరీ సీట్లు, అల్లాయ్ వీల్స్ వంటి 50కి పైగా కొత్త ఫీచర్లు ఉన్నాయి.