MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • PM Modi: టీమిండియాలా కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం.. నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని మోడీ

PM Modi: టీమిండియాలా కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం.. నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని మోడీ

Niti Aayog meet: నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రధాని మోడీ "వికసిత్ భారత్@2047" లక్ష్యంపై దృష్టిసారించి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా పని చేయాలన్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 24 2025, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప్రతి రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక పర్యాటక కేంద్రం
Image Credit : Asianet News

ప్రతి రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక పర్యాటక కేంద్రం

Niti Aayog meet PM Modi: ప్రతి రాష్ట్రం అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలి. దీంతో పర్యాటకాన్ని పెంచడమే కాకుండా.. ఆయా ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, కేంద్రం-రాష్ట్రాలు "టీమ్ ఇండియా"గా ఒకటిగా కలిసి పనిచేస్తే, ఏ లక్ష్యమూ అసాధ్యం కాదని అన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వికసిత్ రాష్ట్రం కోసం వికసిత్ భారత్ @ 2047
Image Credit : Asianet News

వికసిత్ రాష్ట్రం కోసం వికసిత్ భారత్ @ 2047

ఈ సమావేశం ప్రాథమిక థీమ్ ‘వికసిత్ రాష్ట్రం కోసం వికసిత్ భారత్ @ 2047’ అని నీతి ఆయోగ్ తెలిపింది. సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “అభివృద్ధి వేగాన్ని పెంచాలి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే, దేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్‌గా మారుస్తాం. ఇది దేశంలోని 140 కోట్ల ప్రజల ఆకాంక్ష” అని పేర్కొన్నారు.

ఈ గవర్నింగ్ కౌన్సిల్ అత్యున్నత స్థాయి సంస్థగా ఉండగా, అందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలు కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉన్నారు.

36
ఆపరేషన్ సింధూర్ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రులతో  ప్రధాని మోడీ
Image Credit : Asianet News

ఆపరేషన్ సింధూర్ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ

ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో నిర్వహించిన తొలి ప్రధాన సమావేశం ఇదే కావడం విశేషం. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రెవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ పాల్గొన్నారు. కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరుకాలేదు.

46
పర్యాటకంపై ప్రధానమంత్రి ప్రత్యేక దృష్టి
Image Credit : Asianet News

పర్యాటకంపై ప్రధానమంత్రి ప్రత్యేక దృష్టి

ఈ సమావేశంలో టూరిజం పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఒక రాష్ట్రం - ఒక గ్లోబల్ డెస్టినేషన్" అనే కొత్త పర్యాటక ధోరణిని ప్రకటించారు. “ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక పర్యాటక ప్రదేశాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి. దీనివల్ల ఆ ప్రదేశాల పక్కనున్న పట్టణాల అభివృద్ధికీ దోహదపడుతుంది” అని వివరించారు.

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన నేపథ్యంలో ఈ పర్యాటక ప్రోత్సాహం ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తన అభివృద్ధి లక్ష్యాలపై మద్దతు తగ్గకుండా కొనసాగిస్తోంది.

56
భవిష్యత్తుకు అనుగుణంగా నగరాల ప్రగతి
Image Credit : Asianet News

భవిష్యత్తుకు అనుగుణంగా నగరాల ప్రగతి

భారతదేశం వేగంగా పట్టణీకరణవైపు దూసుకుపోతోందని ప్రధాని మోడీ అన్నారు. “ప్రతి రాష్ట్రం, ప్రతి నగరం, ప్రతి నగరపాలిక, ప్రతి గ్రామం వికసిత్‌గా మారాలని మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. అలా అయితే 2047కే ఎందుకు? మనం త్వరలోనే వికసిత్ భారత్‌ను చేరుకోగలం” అని అన్నారు. భవిష్యత్తుకు అనుగుణంగా నగరాల ప్రగతి ప్రధాన టార్గెట్ గా ఉండాలన్నారు.

66
దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం కీలకం
Image Credit : ANI

దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం కీలకం

మహిళల శక్తిని దేశాభివృద్ధిలో ఉపయోగించుకోవడమూ తప్పనిసరిగా ఉండాలన్నారు. “మహిళలను గౌరవంగా పని చేసే వాతావరణంలో చేర్చేలా విధానాలు రూపొందించాలి” అని ప్రధాని మోడీ సూచించారు. దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం కీలకంగా ఉంటుందని చెప్పారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
నరేంద్ర మోదీ
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
అనుముల రేవంత్ రెడ్డి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Delhi Protest : సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి మార్చ్.. రాహుల్, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత
Recommended image2
Rahul Gandhi: సీఈసీకి మోదీ రక్షణ.. ఢిల్లీని జైలుగా మార్చేశారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Recommended image3
INDIA Bloc Protest: సీజేఐ నో చెప్పినా ఆగని ఇండియా కూటమి నిరసనలు.. ఢిల్లీలో ఏం జరుగుతోంది?
Related Stories
Recommended image1
India vs England : బుమ్రా, రాహుల్ లకు కెప్టెన్సీ బాధ్యతలు ఎందుకు దక్కలేవంటే..: అజిత్ అగార్కర్ క్లారిటీ
Recommended image2
PM Modi: తెలంగాణలో 3 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved