MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Justice BV Nagarathna: భారత తొలి మహిళా సీజేఐగా చరిత్ర సృష్టించనున్న జస్టిస్ బీవీ నాగరత్న

Justice BV Nagarathna: భారత తొలి మహిళా సీజేఐగా చరిత్ర సృష్టించనున్న జస్టిస్ బీవీ నాగరత్న

Justice BV Nagarathna: జస్టిస్ బీవీ నాగరత్న మే 25న సుప్రీంకోర్టు కోలీజియంలో చేరనున్నారు. దీంతో భారత న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఎందుకుంటే, ఆమె 2027లో తొలి మహిళా సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. 

2 Min read
Mahesh Rajamoni
Published : May 24 2025, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సుప్రీంకోర్టు కోలీజియంలోకి జస్టిస్ బీవీ. నాగరత్న
Image Credit : Asianet News

సుప్రీంకోర్టు కోలీజియంలోకి జస్టిస్ బీవీ. నాగరత్న

Justice BV Nagarathna: భారతదేశంలో మహిళల న్యాయపరమైన పాత్రకు గౌరవాన్ని తీసుకొచ్చే చారిత్రాత్మక పరిణామంలో కీలక ఘట్టం ఆవిషృతమైంది. జస్టిస్ బీవీ. నాగరత్న మే 25న సుప్రీంకోర్టు కోలీజియంలో సభ్యురాలిగా చేరుతున్నారు. జస్టిస్ అభయ్ ఎస్. ఓకా మే 24న పదవీ విరమణ చేయడంతో ఆమె సుప్రీంకోర్టు కోలీజియంలో అడుగుపెడుతున్నారు. అక్టోబర్ 29, 2027న భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసే వరకు అందులో భాగంగా ఉంటారు.

25
సుప్రీంకోర్టు కోలీజియం
Image Credit : ANI

సుప్రీంకోర్టు కోలీజియం

సుప్రీంకోర్టు కోలీజియం మొత్తం ఐదుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో ఉంటుంది. ఇది భారతదేశంలోని సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హైకోర్టుల నియామకాలకు ముగ్గురు సీనియర్ సభ్యుల అభిప్రాయాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు.

ప్రస్తుతం సుప్రీంకోర్టు కొలీజియంలో చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నాగరత్న సభ్యులుగా ఉంటారు.

Related Articles

Related image1
India U19: ఇంగ్లాండ్ టూర్‌కు టీమిండియా కెప్టెన్ గా అయూష్ మాత్రే
Related image2
PM Modi: టీమిండియాలా కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం.. నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని మోడీ
35
 2027లో భారత సుప్రీంకోర్టు 55వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నాగరత్న
Image Credit : our own

2027లో భారత సుప్రీంకోర్టు 55వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నాగరత్న

జస్టిస్ బీవీ నాగరత్న 2027లో భారత సుప్రీంకోర్టు 55వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. సెప్టెంబర్ 24, 2027న ఆమె సీజేఐగా బాధ్యతలు స్వీకరించి, అక్టోబర్ 29, 2027న పదవీ విరమణ చేస్తారు. ఈ క్రమంలో ఆమె భారత్‌కు తొలి మహిళా సీజేఐగా చరిత్రలో నిలిచిపోతారు. ఆమె కాల పరిమితి 36 రోజులు మాత్రమే అయినప్పటికీ, ఈ నియామకం భారత న్యాయవ్యవస్థలో మైలురాయిగా నిలుస్తుంది.

45
1987లో బెంగళూరులో న్యాయవాదిగా ప్రయాణం మొదలుపెట్టిన జస్టిస్ బీవీ నాగరత్న
Image Credit : Getty

1987లో బెంగళూరులో న్యాయవాదిగా ప్రయాణం మొదలుపెట్టిన జస్టిస్ బీవీ నాగరత్న

జస్టిస్ నాగరత్న, భారత మాజీ సీజేఐ ఈఎస్ వెంకటరామయ్య కుమార్తె. అక్టోబర్ 30, 1962న జన్మించిన ఆమె 1987లో బెంగళూరులో అడ్వొకేట్‌గా చేరారు. మొదట KESVY & Co వద్ద పనిచేసిన ఆమె, 1994లో స్వతంత్రంగా ప్రాక్టీసు ప్రారంభించి రాజ్యాంగ, వాణిజ్య, పరిపాలనా, కుటుంబ న్యాయ వ్యవహారాల్లో నిపుణత సాధించారు.

2008 ఫిబ్రవరిలో ఆమె కర్ణాటక హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. ఆ తర్వాత 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టుకు ఎలివేట్ అయ్యారు.

55
 2016 డీమానిటైజేషన్ జస్టిస్ నాగరత్న కీలక కామెంట్స్
Image Credit : bar bench

2016 డీమానిటైజేషన్ జస్టిస్ నాగరత్న కీలక కామెంట్స్

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నాగరత్న అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో భాగమయ్యారు. ఆమె స్వతంత్ర అభిప్రాయాలతో, ప్రత్యేకంగా మతభేదంతో కూడిన అభిప్రాయాలు వెల్లడించిన న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా 2016 డీమానిటైజేషన్ పై రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఆమె ఏకైక వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమె అభిప్రాయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరిగా విచారించకుండా కేంద్ర ప్రతిపాదనను ఆమోదించిందని పేర్కొన్నారు.

ఆమె కోలీజియంలో చేరటం మహిళల న్యాయపరమైన ప్రాతినిధ్యాన్ని మరింత ముందుకు తీసుకెళుతుంది. అలాగే, భారత న్యాయవ్యవస్థలో పారదర్శకత, స్వతంత్రతకు ఊతమిచ్చే మార్గాలను సిద్ధం చేస్తుందని న్యాయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
మహిళలు

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved