గత రెండు నెలలకు పైగా జైల్లోనే ఉండటంతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాడు. తాజాగా అతడు అనారోగ్యానికి గురయ్యాడు. 

Vallabhaneni Vamsi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ నేత వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న వంశీ శుక్రవారం రాత్రి శ్వాస సమస్యతో బాధపడ్డాడు. దీంతో పోలీసులు వెంటనే ఆయనను కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు పోలీసులు. ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు పరిస్థితి సీరియస్ గా ఉంటే విజయవాడ హాస్పిటల్ కు తరలిస్తామని తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అయితే శనివారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్ధితి మెరుగుపడటంతో తిరిగి కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ ఆరోపణ కేసులో ఆయనను అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. రెండో రోజు ఆయన విచారణ కొనసాగనుంది.

గత రెండు నెలలుగా జైల్లోనే ఉండటంతో వల్లభనేని వంశీ గుర్తుపట్టలేనివిధంగా తయారయ్యారు. బక్కచిక్కిపోయిన ఆయన తెల్లనిజట్టు, ముఖంపై గాట్లతో పేషెంట్ లా కనిపిస్తున్నారు. చాలా రోజులుగా ఆయన శ్వాస సమస్యతో బాధపడుతుండగా శుక్రవారం రాత్రి ఇది మరింత ఎక్కువయ్యింది. ఊపిరి తీసుకోవడం సమస్యగా మారడంతో వంశీని హాస్పిటల్ కు తరలించారు కంకిపాడు పోలీసులు.