విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం బంద్... మూడు నెలల పాటు ఇదే పరిస్థితి...

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై గల దుర్గామల్లేశ్వర స్వామి ఆలయాన్ని మూడు నెలల పాటు మూసివేయనున్నారు. 

First Published Mar 21, 2022, 4:33 PM IST | Last Updated Mar 21, 2022, 4:33 PM IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై గల దుర్గామల్లేశ్వర స్వామి ఆలయాన్ని మూడు నెలల పాటు మూసివేయనున్నారు. అభివృద్ధి పనులకోసమే ప్రధాన ఆలయాన్ని మూసివేస్తున్నట్లు... భక్తులు సహకరించాలని ఆలయ సిబ్బంది భక్తులను కోరారు. దాదాపు 8 కోట్ల వ్యయంతో మల్లేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆలయ గోపురంతో పాట ప్రాంగణం మొత్తాన్ని మరింత సుందరంగా తయారుచేయనున్నారు. భక్తుల దర్శనార్థం నటరాజ స్వామి ఆలయం వెనుక భాగంలో శివలింగాన్ని ప్రతిష్టించనున్నట్లు అధికారులు తెలిపారు.