కరకట్ట రోడ్డు విస్తరణ పనులను వ్యతిరేకిస్తూ... పొలాల్లో ప్లెక్సీలతో బాధిత రైతుల వినూత్న నిరసన

తాడేపల్లి: తమకు నష్టపరిహారం చెల్లించకుండానే కరకట్ట రోడ్డువిస్తరణ పనులు చేపడుతుండటంతో ఆగ్రహించిన బాధిత రైతులు ఆందోళనకు దిగారు.

Share this Video

తాడేపల్లి: తమకు నష్టపరిహారం చెల్లించకుండానే కరకట్ట రోడ్డువిస్తరణ పనులు చేపడుతుండటంతో ఆగ్రహించిన బాధిత రైతులు ఆందోళనకు దిగారు. తమ పొలాలను ధ్వంసంచేసి మరీ రోడ్డు నిర్మాణం చేపడుతుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసారు. రోడ్డు విస్తరణలో కోల్పోతున్న భూములకు నష్టపరిహారం చెల్లించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలంటూ పొలాల్లో ప్లెక్సీలు ఏర్పాటుచేసి వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు ఉండవల్లికి చెందిన బాధిత రైతులు.ఇటీవల సీతానగరం నుండి రాయపూడికి 15 కిలోమీటర్లు మేర జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను బాధిత రైతులు అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించకుండా ఇలాగే కరకట్ట అభివృధి పనుల పేరుతో తమ పొలాల్లోకి జేసిబిలతో ప్రవేశించి దౌర్జన్యంగా పంటలను నాశనం చేస్తే ఆత్మహత్యే శరణ్యమని ఉండవల్లికి చెందిన 30 మంది బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు. తమకు ప్రభుత్వం అన్యాయం చేస్తే హైకోర్టును ఆశ్రయిస్తామని బాధిత రైతులు చెబుతున్నారు.  

Related Video