Asianet News TeluguAsianet News Telugu

పిల్లలను నెట్టేసి భర్తను ప్రియుడితో కలిసి ఉరేసి చంపిన భార్య

వివాహేతర సంబంధానికి  అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ఈ సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మండలం యండ్లపల్లిలో జరిగింది. 

Wife kills husband at Suryapet
Author
Suryapet, First Published Sep 15, 2018, 11:22 AM IST

సూర్యాపేట: వివాహేతర సంబంధానికి  అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ఈ సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మండలం యండ్లపల్లిలో జరిగింది. 

ఆత్మకూర్‌(ఎస్‌) మండలం తుమ్మలపెన్‌పహాడ్‌కు చెందిన జ్యోతికి 20 ఏళ్ల క్రితం మహబూబాద్‌ జిల్లా కొరివి మండలం సిలువేరు గ్రామానికి చెందిన గడ్డం గంగయ్య(46)తో పెళ్లయింది. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. బతుకుదెరువు కోసం ఆరేళ్ల క్రితం తుమ్మలపెన్‌పహాడ్‌ గ్రామానికి వచ్చారు. 

అదే గ్రామానికి చెందిన సల్వాది బుచ్చిబాబుతో మూడేళ్ల క్రితం జ్యోతికి వివాహేతర సంబంధం ఏర్పడింది, వేరే ప్రాంతానికి వెళ్లి నెల రోజులపాటు ఉన్నారు. ఆరు నెలల క్రితం సూర్యాపేట రూరల్‌ పోలీస్ స్టేషన్‌లో గంగయ్య ఆ వ్యవహారంపై ఫిర్యాదు చేశాడు. 

పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టి మంచిగా ఉండాలని సర్దిచెప్పారు. అయినా ఆమె మారలేదు. దీంతో విసుగుచెంది 4 నెలల క్రితం తన పెద్దకూతురు మానస అత్తగారి గ్రామమైన యండ్లపల్లికి భార్య, ఇద్దరు కూతుళ్లతో గంగయ్య వచ్చాడు. సూర్యాపేటలో కూలీ పనిచేస్తున్నాడు. 

బుచ్చిబాబు గురువారం రాత్రి 10 గంటలకు గంగయ్య ఇంటికి వచ్చి, జ్యోతి సాయంతో అతడిని తీవ్రంగా కొట్టాడు. పిల్లలు అడ్డొస్తే చంపుతానని బెదిరించి మెడకు ఉరితాడు వేసి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించారు. 

తెల్లవారుజామున గ్రామస్తులను నమ్మించి తుమ్మలపెన్‌పహాడ్‌ గ్రామానికి మృతదేహాన్ని తరలించారు. అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జ్యోతిని విచారించడంతో అసలు విషయం చెప్పింది.

ఈ వార్తాకథనాలు చదవండి

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

వివాహేతర సంబంధం: ప్రశ్నించిన భర్తను చంపిన భార్య లవర్

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: దిమ్మ తిరిగే షాకిచ్చిన మొగుడు

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

భర్తను చంపిన దేవిక: విడాకులు తీసుకొందామని, బెనర్జీతో ఎఫైర్ కోసమిలా..

భర్తను చంపిన భార్య: 'జగన్ అమాయకుడు, మంచోడు, దేవిక ఇలాంటిదా?'

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య; మూసీలో మృతదేహం

భర్తను చంపిన స్త్రీ: చపాతీ కర్రతో కొట్టి... నైలాన్ తాడుతో గొంతు బిగించి...

తాగిన మైకంలో భర్తను హత్య చేసిన భార్య

వేములవాడ రాజన్న సన్నిధిలో భర్తను చంపిన భార్య

 

Follow Us:
Download App:
  • android
  • ios