భర్తను చంపిన దేవిక: విడాకులు తీసుకొందామని, బెనర్జీతో ఎఫైర్ కోసమిలా..

devika and benarjee arrested for jagan murder
Highlights

 భర్త అడ్డు తొలగించుకొనేందుకు గాను  దేవిక పథకం ప్రకారం వ్యవహరించిందని పోలీసులు గుర్తించారు.వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది దేవిక. ప్రియుడు బెనర్జీతో కలిసి జగన్‌ను హత్య చేసిందని పోలీసులు తెలిపారు

హైదరాబాద్: భర్త అడ్డు తొలగించుకొనేందుకు గాను  దేవిక పథకం ప్రకారం వ్యవహరించిందని పోలీసులు గుర్తించారు.వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది దేవిక. ప్రియుడు బెనర్జీతో కలిసి జగన్‌ను హత్య చేసిందని పోలీసులు తెలిపారు. కుటుంబసభ్యులు హెచ్చరించినా  దేవిక మాత్రం బెనర్జీతో వివాహేతర సంబంధాన్ని  మానలేదు. దీంతో ఆఖరకు భర్తను హత్యచేసింది దేవిక.

హైద్రాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో భర్త జగన్ ను ప్రియుడు బెనర్జీతో కలిసి దేవిక హత్య చేసింది.  కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన బెనర్జీకి దేవికకు కొంత కాలం క్రితం వివాహేతర సంబంధం ఏర్పడింది. దేవిక గతంలో ఓ ఆసుపత్రిలో హౌస్‌కీపింగ్ విభాగంలో పనిచేసేది. 

ఆ సమయంలోనే  దేవికకు బెనర్జీకి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ సంబంధాన్ని గుర్తించిన జగన్  భార్యను మందలించాడు. అంతేకాదు కుటుంబసభ్యులను పిలిచి  పంచాయితీ పెట్టించాడు.  కుటుంబసభ్యులు కూడ  దేవికను హెచ్చరించారు.

ఈ వివాహేతర సంబంధం కారణంగా దేవికను జగన్ పని మాన్పించేశాడు.  ఫిల్మ్ నగర్‌కు మకాన్ని మార్చారు. రెండు మాసాల క్రితమే ఫిల్మ్‌నగర్‌కు షిఫ్ట్ అయ్యారు. జగన్  నివాసం ఉంటున్న ఇంటి పైనే బెనర్జీ కూడ అద్దెకు దిగాడు.

అయితే దేవిక, బెనర్జీలు పథకం ప్రకారంగానే  ఇక్కడ ఇల్లును అద్దెకు తీసుకొన్నారని విచారణలో  పోలీసులు గ్రహించారు. వివాహేతర సంబంధానికి  జగన్  అడ్డుగా ఉన్నాడని భావించిన దేవిక అతడిని మట్టుబెట్టాలని ప్లాన్ చేసింది.

జగన్ తో విడాకులు తీసుకోవాలని బెనర్జీ కోరారు.  అయితే అప్పటికే ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో  కుటుంబసభ్యులు కూడ  దేవికను హెచ్చరించారు. అయితే ఈ విషయమై వెనక్కుతగ్గారు.

బెనర్జీతో సంబంధాన్ని కొంతకాలం మానేసిన దేవిక ఆ తర్వాత కొనసాగించింది. జగన్ ను హత్య చేస్తే  తమకు అడ్డు ఉండదని భావించారు. జగన్ ను హత్య చేసేందుకు తొలుత  బెనర్జీ వచ్చాడు. ఆ తర్వాత  హిట్ తీసుకొని  వచ్చినట్టు సీసీటీవి పుటేజీలో దృశ్యాలను సేకరించినట్టు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 

జగన్‌ నిద్రపోతున్న సమయంలో  అతడిని బెనర్జీతో కలిసి భార్య దేవిక చంపే సమయంలో నిద్రిస్తున్న పిల్లలు లేచినట్టు పోలీసులు తెలిపారు. అయితే  దీంతో పిల్లలను బాత్‌రూమ్‌లో వేసి దేవిక గడియ పెట్టిందని చెప్పారు.  జగన్ చనిపోయిన కొద్దిసేపటికి  గడియ తీసిందన్నారు. 

ఘర్షణ జరిగినట్టుగా ఆనవాళ్లు సృష్టించే ప్రయత్నం చేశారని పోలీసులు గుర్తు చేశారు. మరో వైపు తన శరీరంపై దేవిక గాయాలు చేసుకొందని పోలీసులు తెలిపారు.  అయితే జగన్  అడ్డు లేకుండాపోతే బాగుటుందని భావించారు. 

జగన్ చనిపోయిన తర్వాత తన సోదరుడికి ఫోన్ చేసి చనిపోదామని  తనను వేధించాడని .. అందుకే తాను జగన్ ను హత్య చేసినట్టు  సోదరుడికి దేవిక చెప్పిందన్నారు. 

ఈ వార్తలు చదవండి:భర్తను చంపిన భార్య: 'జగన్ అమాయకుడు, మంచోడు, దేవిక ఇలాంటిదా?'

భర్తను హత్య చేసి.. శవం పక్కనే ప్రియుడితో...

ఫిల్మ్‌నగర్‌లో భర్తను చంపిన దేవిక: పారిపోయిందేవరు?

అందుకే చంపా: భర్త హత్యపై దేవిక, ఆ గడ్డం వ్యక్తి ఎవరు?

ఫిల్మ్ నగర్ లో ఘటన: నోట్లో హిట్ కొట్టి భర్తను చంపేసిన దేవిక (వీడియో)

 

 

loader