ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య; మూసీలో మృతదేహం

Wife kills husband with the help of lover in hyderabad
Highlights

రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లిలో  ప్రియుడి మోజులో పడి భర్తను హత్యచేసింది. భర్త మృతదేహం  లభించకుండా  పెట్రోల్ పోసి దగ్డం చేసింది. సాక్ష్యాలు లేకుండా చేయాలనే  ఉద్దేశ్యంతో ఎముకలను  మూసీ నదిలో  వేసింది

హైద్రాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లిలో  ప్రియుడి మోజులో పడి భర్తను హత్యచేసింది. భర్త మృతదేహం  లభించకుండా  పెట్రోల్ పోసి దగ్డం చేసింది. సాక్ష్యాలు లేకుండా చేయాలనే  ఉద్దేశ్యంతో ఎముకలను  మూసీ నదిలో  వేసింది. అంతేకాదు తన భర్త ఆచూకీ తెలియడం లేదంటూ ఆమె పోలీసులకు కూడ 
ఫిర్యాదు చేసింది. ఎట్టకేలకు నిందితులను  పోలీసులు అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్ రాజేంద్రనగర్  నియోజకవర్గంలోని శివరాంపల్లి ఆనంద్, మహేశ్వరీ దంపతులు నివాసం ఉండేవారు.  2010లో  మహేశ్వరీని ఆనంద్ వివాహం చేసుకొన్నాడు.  అయితే కొంత కాలం పాటు వీరి కాపురం సజావుగా సాగింది.  ఆ తర్వాత మద్యానికి ఆనంద్ బానిసగా మారాడు.

మద్యానికి  బానిసగా మారిన ఆనంద్ భార్యను పట్టించుకోవడం మానేశాడు.  ఈ క్రమంలోనే తరచూ ఆనంద్ కోసం  ఇంటికి వచ్చే  సంజయ్‌తో  మహేశ్వరీకి పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

ప్రియుడి మోజులో పడిన  మహేశ్వరీ భర్తను వదిలించుకోవాలని ప్లాన్  చేసింది. దీంతో ఈ ఏడాది మే 18వ తేదీన ఆనంద్ మద్యం తాగి వచ్చాడు.  సంజయ్ ను కూడ మహేశ్వరీ పిలిపించింది. మద్యం మత్తులో ఉన్న ఆనంద్‌ను  సంజయ్‌ సహాయంతో ఆమె హత్య చేసింది.

ప్రియుడితో కలిసి  ఆనంద్ మృతదేహన్ని ఇంటి నుండి తీసుకెళ్లింది. సమీపంలోని మూసీ పరివాహక ప్రాంతంలో దగ్దం చేసింది.  రెండు రోజుల తర్వాత మే 20వ తేదీన ప్రియుడితో కలిసి మరోసారి భర్త మృతదేహన్ని దగ్దం చేసిన ప్రాంతానికి వెళ్లింది. భర్త ఎముకలను  సమీపంలోని మూసీ నదిలో కలిపింది.

సాక్ష్యాలు చేయకుండా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆమె  ఎముకలను మూసీలో వేసింది.  అయితే ఏమీ తెలియనట్టుగానే  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు.  

అయితే మృతి చెందిన రోజున రాత్రి పూట ఆనంద్ ఇంటికి వచ్చాడని పోలీసులు గుర్తించారు. ఈ విషయమై  పోలీసులు ఆనంద్ భార్యను విచారించారు.  ఈ విచారణలో తొలతు తనకు ఏమీ తెలియదని ప్రకటించారు. కానీ, ఆ తర్వాత వాస్తవాన్ని ఆమె ఒప్పుకొన్నారు. ప్రియుడితో కలిసి  భర్త ఆనంద్‌ను హత్యచేసినట్టు ఆమె ఒప్పుకొన్నారు.

loader