భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: దిమ్మ తిరిగే షాకిచ్చిన మొగుడు

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 24, Aug 2018, 12:35 PM IST
Man murders wife, her paramour in TN
Highlights

నిద్రపోతున్నట్టుగా నటించి  ప్రియుడితో రాసలీలల్లో  ఉన్న భార్యను ఆమె లవర్‌ను  హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు ఓ వ్యక్తి. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.


చెన్నై: నిద్రపోతున్నట్టుగా నటించి  ప్రియుడితో రాసలీలల్లో  ఉన్న భార్యను ఆమె లవర్‌ను  హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు ఓ వ్యక్తి. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. పద్దతిని మార్చుకోవాలని  కోరినా కూడ ఫలితం లేకపోవడంతోనే ఇద్దరిని  హత్య చేసినట్టు నిందితులు తెలిపారు.

తమిళనాడు రాష్ట్రంలోని  తూత్తుకూడి జిల్లా కయత్తారు సమీపంలోని మమ్మలైపట్టి గ్రామానికి చెందిన పెరుమాల్ వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య కనకలక్ష్మి, ముగ్గురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. 

కోవిల్‌పట్టి సమీపంలోని తంగమణికి పెరుమాల్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. తంగమణి భర్త హరికృష్ణన్  కేరళ రైల్వేలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరికి ఓ కొడుకు, ఇద్దరు కూతుళ్లున్నారు.

పెరుమాళ్, తంగమణి వివాహేతర సంబంధం బయటకు తెలిసింది. దీంతో వీరిద్దరిని బంధువులు మందలించారు.  అయినా  వారిద్దరూ మాత్రం తమ ఎఫైర్‌ను కొనసాగించారు. కేరళలో వరదల కారణంగా హరికృష్ణన్ స్వగ్రామానికి వచ్చాడు. గురువారం రాత్రి పూట భర్తకు తంగమణి నిద్ర మాత్రలు ఇచ్చింది. అయితే  హఠాత్తుగా భార్య నిద్రమాత్రలు ఇవ్వడంతో హరికృష్ణకు అనుమానం వచ్చింది.

అయితే భార్యకు తెలియకుండా నిద్రమాత్రలు వేసుకొన్నట్టుగా హరికృష్ణన్ నమ్మించాడు. నిద్రలోకి పోయినట్టు నటించాడు.  అర్ధరాత్రి పూట పెరుమాల్ తంగమణికి ఫోన్ చేశాడు.  ఊరిబయట గడ్డివాము వద్దకు రావాలని కోరాడు. 

ఈ ఫోన్‌ను రిసీవ్ చేసుకొన్న వెంటనే తంగమణి ఊరిబయటకు వెళ్లింది. అయితే  భార్య బయటకు వెళ్లగానే  తంగమణికి తెలియకుండానే కత్తిని చేత బట్టుకొని  హరికృష్ణన్ వేరే దారిలో ఊరి వెలుపల ఉన్న గడ్డివాము వద్దకు చేరుకొన్నాడు.

అయితే అప్పటికే  ప్రియుడితో తంగమణి రాసలీలల్లో మునిగిపోయింది.  గడ్డివాము వద్దకు చేరుకొన్న హరికృష్ణన్ ప్రియుడితో తన భార్య తంగమణిని చూసి కోపంతో ఊగిపోయాడు. తన వెంట తెచ్చుకొన్న కత్తితో  ఇద్దరిని నరికేశాడు. ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.  ఆ తర్వాత హరికృష్ణన్ కడంబూరు పోలీస్ స్టేషన్ ‌లో లొంగిపోయాడు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం  తరలించారు.

ఈ వార్తలు చదవండి

ఆటోలోనే మహిళ ఎదుట ప్యాంట్ విప్పేసీ.... షాకైన లేడీ

దారుణం: కూతుళ్లపై ఏడాదిగా తండ్రి రేప్, దిమ్మ తిరిగే షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: బెలూన్‌తో భార్య, కూతురును చంపాడు

నకిలీ వక్షోజాలతో బ్యూటీ కాంటెస్ట్ టైటిల్ గెల్చుకొన్న క్రిస్టినా కామెనోవా

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా...

అసహజ శృంగారం: భార్యకు వేధింపులు, ఆత్మహత్యాయత్నం

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో, రేప్: బాధితురాలు ఏం చేసిందంటే?

ట్రయాంగిల్ లవ్‌స్టోరీ: మూడో లవర్‌తో ఎంజాయ్, ఇద్దరు లవర్లకు,భర్తకు షాక్

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

loader