ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 24, Aug 2018, 10:58 AM IST
wife murder her husband with lover
Highlights

 వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పెళ్లై ఆరు నెలలు తిరగముందే వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్యను హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘటన తిరువణ్ణామలై జిల్లా వెంబాక్కం సమీపం పిల్లాతాంగల్‌ లో చోటు చేసుకుంది. పిల్లాతాంగల్ కు చెందిన పుష్పరాజ్‌ (32),పునీత (26) దంపతులు. వీరికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది

తమిళనాడు: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పెళ్లై ఆరు నెలలు తిరగముందే వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్యను హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘటన తిరువణ్ణామలై జిల్లా వెంబాక్కం సమీపం పిల్లాతాంగల్‌ లో చోటు చేసుకుంది. పిల్లాతాంగల్ కు చెందిన పుష్పరాజ్‌ (32),పునీత (26) దంపతులు. వీరికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. 

పుష్పరాజ్‌ చెన్నైలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈనెల 20న డ్యూటీకి వెళ్లిన పుష్పరాజ్‌ తిరిగి రాలేదు. అయితే  కాంచీపురం జిల్లా కోలివాక్కం నది ఒడ్డున పుష్పరాజ్‌ శవమై కనిపించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పుష్పరాజ్ ను తన ప్రియుడు ప్రకాష్ తో కలిసి హత్య చేసిందని తేలింది. పునీత, ప్రకాష్ ప్రేమికులు. అయితే కుటుంబ సభ్యులు పుష్పరాజ్ తో పునీతకు వివాహం జరిపించారు. 

పెళ్లైనా పునీతలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రియుడు ప్రకాష్ తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. పునీత వివాహేతర సంబంధం విషయం  తెలుసుకున్న పుష్పరాజ్ ఆమెను మందలించాడు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించాడు. దీంతో తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన పునీత ప్రియుడు ప్రకాష్ తో కలిసి హత్య చేసింది. పునీత, ఆమె ప్రియుడు ప్రకాష్ లను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి

మాందాసర్ రేప్: ఇద్దరు నిందితులకు ఉరి, 2 నెలల్లో తీర్పు

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న 17 ఏళ్ల కొడుకును చంపిన తల్లి

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా...

 

loader