భర్తను చంపిన భార్య: 'జగన్ అమాయకుడు, మంచోడు, దేవిక ఇలాంటిదా?'

house owner Laxmi demands to punish devika and benarjee
Highlights

 అక్కా అంటూ జగన్ తనను పిలిచేవాడని... జగన్ చాలా అమాయకుడని  ఇంటి ఓనర్ లక్ష్మి చెప్పారు. రెండు మాసాల క్రితమే తమ ఇంట్లో జగన్ దంపతులు  అద్దెకు దిగారని  ఆమె  చెప్పారు.

హైదరాబాద్: అక్కా అంటూ జగన్ తనను పిలిచేవాడని... జగన్ చాలా అమాయకుడని  ఇంటి ఓనర్ లక్ష్మి చెప్పారు. రెండు మాసాల క్రితమే తమ ఇంట్లో జగన్ దంపతులు  అద్దెకు దిగారని  ఆమె  చెప్పారు.

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన  దేవిక ఉదంతంపై  ఇంటి యజమాని లక్ష్మి  ఓ మీడియా ఛానెల్‌కు చెప్పారు.  జగన్ చాలా మంచివాడని  ఆమె చెప్పారు. చాలా అమాయకుడని ఆమె అభిప్రాయపడ్డారు.  ఎప్పుడూ కన్పించినా అక్కా అంటూ ఆప్యాయంగా పలకరించేవాడని ఆమె గుర్తు చేసుకొన్నారు.

తమ ఇంట్లోకే ప్రియుడిని రప్పించుకొని  దేవిక వివాహేతర సంబంధాన్ని కొనసాగించడంపై ఆమె మండిపడింది.  పచ్చని సంసారంలో నిప్పులు పోసుకొందన్నారు.  దేవిక ప్రవర్తనపై తమకు ఏనాడూ కూడ అనుమానం రాలేదని ఆమె చెప్పారు. 

జగన్, దేవిక ఎప్పుడూ గొడవపడినట్టు కూడ తాము చూడలేదు, వినలేదన్నారు. ఆ దంపతుల పిల్లలు కూడ ఈ విషయాన్ని తమకు చెప్పలేదన్నారు. జగన్‌తో కలిసి జీవించడం ఇష్టం లేకపోతే  విడిపోతే సరిపోయేదన్నారు. జగన్‌ను హత్యచేసిన దేవికను, బెనర్జీని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. తమ ఇంట్లో ఈ ఘటన జరిగిందని చెప్పడం లేదన్నారు. ఈ రకమైన తప్పులు జరగకూడదనేదే తన ఉద్దేశ్యమన్నారు. 

      ఈ వార్తలు చదవండి:భర్తను హత్య చేసి.. శవం పక్కనే ప్రియుడితో.

                                         ఫిల్మ్‌నగర్‌లో భర్తను చంపిన దేవిక: పారిపోయిందేవరు?

                                         ఫిల్మ్ నగర్ లో ఘటన: నోట్లో హిట్ కొట్టి భర్తను చంపేసిన దేవిక (వీడియో)

                                        అందుకే చంపా: భర్త హత్యపై దేవిక, ఆ గడ్డం వ్యక్తి ఎవరు?

                                        

 

loader