తాగిన మైకంలో భర్తను హత్య చేసిన భార్య

తాగిన మైకంలో భర్తను హత్య చేసిన భార్య

తాగిన మైకంలో ఓ భార్య తన భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. అర్థరాత్రి సమయంలో పడుకున్న భర్త ముఖంపై బండరాయి వైసి అత్యంత దారుణంగా హతమార్చింది. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని ప్రయత్నించి చివరకు పట్టుబడింది. ఈ హత్యకు సంబంధించిన వివరాలు కింది విదంగా ఉన్నాయి.

కరీంనగర్‌ పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో సిరిగి మల్లయ్య, ఎల్లవ్వ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులిద్దరికి మద్యం సేవించే అలవాటు ఉంది. అయితే గతకొంత కాలంగా వీరి మద్య కలహాలు చెలరేగుతున్నాయి.  అలాగే మంగళవారం కూడా వీరి మద్య చిన్న గొడవ జరిగింది. అయితే భర్తపై తీవ్ర ఆగ్రహంతో వున్న ఎల్లవ్వ తాగిన మైకంలో భర్తను బండరాయితో మోది హత్య చేసింది. అనంతరం తన భర్త ప్రమాదవశాత్తు కిందపడిపోయి చనిపోయాడని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే ఆమె మాటలు నమ్మెలా లేకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అసలు విషయం బైటపడింది.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులు విచారించారు. మద్యం మత్తులోనే ఎల్లవ్వ ఈ హత్యకు పాల్పడి ఉంటుందని తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.  

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos