తెలుగు రాష్ట్రాల్లో భర్తలను చంపుతున్న భాక్యల కేసులు ఎక్కువయ్యాయి. నాగర్ కర్నూల్ స్వాతి నుండి ప్రారంభమైన ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ మహిళ కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా కత్తితో గొంతు కోసి చంపిన దుర్ఘటన వేములవాడ రాజరాజేశ్వరి సన్నిధిలో జరిగింది. ఈ హత్యకు సంభందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

 సిద్దిపేట జిల్లా నంగనూర్‌ మండలం ఘన్పూర్‌ గ్రామానికి చెందిన బండి బాలయ్య(37), భార్య నర్సవ్వ లు దంపతులు. ఆదివారం రోజు సెలవురోజు కావడంతో వీరిద్దరు కలిసి రాజన్న దర్శనం కోసం పక్కనే వున్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ వెళ్లారు. అయితే ఉదయం సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్న ఈ దంపతులు రాత్రి సమయంలో అక్కడే బస చేశారు. ఈ సమయంలో భర్త ఫుల్లుగా మద్యం సేవించి పడుకున్నాడు. ఇదే అదునుగా భావించిన భార్య నర్సవ్వ తనతో పాటెు తెచ్చుకున్న కత్తితో భర్త గొంతు కోసింది. బాధితుడి ఆర్తనాదాలు విన్న వారి సమీపంలోని భక్తులు అక్కడికి చేరుకునే లోపు నర్సవ్వ అక్కడినుండి పరిరయ్యంది. దీంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ హత్య పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. భార్య నర్సవ్వ  అక్రమ సంభందమే ఈ హత్యకు కారనమై ఉంటుందని పోలీసులు బావిస్తున్నారు. ఈ కోణంలో విచారన చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.