హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఒక ఆడబిడ్డ తండ్రిగా ఎన్ కౌంటర్ ను తాను సమర్థిస్తున్నట్లు తెలిపారు. 

అయితే న్యాయ స్థానం ద్వారా నిందితులకు శిక్ష పడటం సరైన విధానమని చెప్పుకొచ్చారు. ప్రస్తుత కాలంలో ఎమ్మెల్యేలకు గన్ మెన్లను ఇవ్వడం కంటే అమ్మాయిలకు రివాల్వర్లు ఇవ్వడం ఉత్తమం అని అభిప్రాయపడ్డారు. 

తెలంగాణలో దిశ రేప్, హత్య ఘటనల కంటే అనేక దారుణాలు చోటు చేసుకున్నాయని వాటిపై స్పందించకపోవడం తమ తప్పేనని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. హాజీపూర్ ఘటనలో శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేస్తారో లేదో చూడాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

కనువిప్పు కలగాలి, ఇంతటితో వదలొద్దు: దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై పవన్

అత్యాచారం జరిగితే ఎన్ కౌంటర్ జరగాల్సిందేనా అంటూ అభిప్రాయపడ్డారు. సమస్యకు మూలాన్ని వెతకాలన్నారు. రాజకీయ పార్టీలు తమ లబ్ధి కోసం ఓ అమ్మాయి జీవితాన్ని వాడుకోవడం సమంజసమా అంటూ నిలదీశారు జగ్గారెడ్డి.  

అత్యాచారాలు, ఎన్‌కౌంటర్లను రాజకీయాలకు వాడుకుంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై మండిపడ్డారు. ఎన్ కౌంటర్ పై తలసాని వ్యాఖ్యలు చూస్తుంటే ఎన్ కౌంటర్ ను రాజకీయ లబ్ధికోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

తెలంగాణలో సంచలనం రేపిన ఎన్ కౌంటర్లు ఇవే: హీరో సజ్జనార్...  
 
ఈ ఎన్‌కౌంటర్‌ ద్వారా మానభంగాలు జరగవని చెప్పగలరా? అంటూ పోలీసులను తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు జగ్గారెడ్డి. మహిళల రక్షణ కోసం జిల్లాల్లో కంట్రోల్‌రూమ్‌లు పెట్టాలని, ఎమ్మెల్యేల కంటే మహిళలకు గన్‌మన్లు ఇవ్వడం బెటర్‌ అంటూ చెప్పుకొచ్చారు.  

మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి వెలుగులోకి రాని ఘటనలు అనేకం ఉన్నాయని చెప్పుకొచ్చారు. దిశా ఘటన తర్వాత ఎన్‌కౌంటర్ చేయాలని ఉరి తీయాలనే డిమాండ్లు పెరిగాయని జగ్గారెడ్డి తెలిపారు. ఏ ప్రభుత్వమైనా ప్రజల ఆకాంక్షల మేరకే పని చేయాలన్నారు.

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ తంటా: ఆ రెండు సంఘటనలపై ఆందోళనలు

మరోవైపు స్వయం ప్రకటిత దేవుడు, రేప్‌ కేసు నిందితుడు స్వామి నిత్యానందపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిత్యానందను కూడా పోలీసులు  ఎన్ కౌంటర్ చేస్తారా అంటూ సెటైర్లు వేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.