నాగ చైతన్య - సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ - మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు- అసలు ఏం జరిగింది?
KTR - Samantha, Naga Chaitanyas divorce: ఒకప్పటి టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య - సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR - Samantha, Naga Chaitanyas divorce: కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మంత్రి కొండా సురేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని షేక్ చేస్తున్నాయి. కొండ సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య - సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, కేటీఆర్ కారణంగా చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకుని టాలీవుడ్ కు దూరంగా వెళ్లిపోయారంటూ షాకింగ్ ఆరోపణలు చేశారు.
సమంత-నాగ చైతన్యల విడాకులకు కేటీఆర్ కారణం : కొండా సురేఖ
సమంత - నాగ చైతన్య విడాకులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని తెలంగాణ మంత్రి కొండా సురేఖ బుధవారం (అక్టోబర్ 2) షాకింగ్ ఆరోపణలు చేశారు. కేటీఆర్ కారణంగా సమంత మాత్రమే కాకుండా చాలా మంది నటీనటులు తొందరగా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా వెళ్లారని ఆరోపించాడు. కొండ సురేఖ మాట్లాడుతూ.. "ఆయన (కేటీఆర్) డ్రగ్స్ అలవాటు పడ్డాడు. ఆయన తీసుకోవడమే కాకుండా సినిమా వాళ్లకు కూడా అందించాడు. రేవ్ పార్టీలు చేశాడు. వాళ్ల ఫీలింగ్స్ తో ఆడుకుని బ్లాక్ మెయిల్ చేశాడు. మధమెక్కి వారిని ఇబ్బంది పెట్టింది కేటీఆర్.. ఈ విషయం సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు.. ఇది బహిరంగ రహస్యం" అని కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు.
ఎన్-కన్వెన్షన్ కోసం కేటీఆర్ సమంతను పంపమన్నాడు : కొండా సురేఖ
సమంత-నాగ చైతన్యల విడాకులకు 100 శాతం కేటీఆర్ కారణమని కొండా సురేఖ ఆరోపించారు. స్టార్ కపుల్ విడాకులకు 100 శాతం ఆయనే బాధ్యత వహిస్తారన్నారు. ఎన్-కన్వెన్షన్‌ను కూల్చివేయకుండా ఉండేందుకు బదులుగా సమంతను తన వద్దకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశారనీ, సమంతని తన వద్దకు వెళ్లమని నాగార్జున కోరగా ఆమె వెళ్లేందుకు నిరాకరించిందని కొండ సురేఖ వ్యాఖ్యానించారు. దీని కారణంగా నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ రోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100 శాతం కేటీఆర్ కారణమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్ల ఫోన్ లను ట్యాపింగ్ చేసి, ఆ రికార్డులతో వారిని బెదిరించి చాలా మంది హీరోయిన్లను లొంగదీసుకున్నాడని ఆరోపించారు.
Telangana minister #KondaSurekha in a shocking allegation on Wednesday, October 2, stated that #BRS working president #KTR (KT Rama Rao) was the reason behind #Samnatha and #NagaChaitanya’s divorce. pic.twitter.com/i8pwgGYzay
— mahe (@mahe950) October 2, 2024
కొండ సురేఖకు కేటీఆర్ ఎందుకు టార్గెట్ అయ్యాడు? రఘునందన్ రావుతో సంబంధమేంటి?
కొండ సురేఖ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. కొండ సుకేఖ వ్యాఖ్యలలో మొత్తానికి పెద్ద టార్గెట్ గా మారింది కేటీఆర్. అయితే, నాగ చైతన్య-సమంతలను లాగడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వివాదం రావడానికి ముందు సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టు కారణంగా మారింది. ఆ పోస్టులో ఒక కార్యక్రమంలో కొండా సురేఖ- బీజేపీ నాయకులు ఎంపీ రఘునందన్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండ సురేఖకు రఘు నందన్ రావు పూల మాల వేస్తూ సత్కరించారు. అయితే, ఈ ఫోటోను పలువురు అసభ్యంగా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పలువురు దీనిని షేర్ చేయడంతో వివాదం మొదలైంది.
దీనిపై మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనం ఇదే నంటూ విమర్శించారు. మరోసారి మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. రఘునందన్ రావు సైతం బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. న్యాయపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
అలాగే, బీఆర్‌ఎస్ నాయకులు, అధికారం కోల్పోయిన నిరాశతో, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియడం లేదని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ , హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్ నేతలు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. "కేసీఆర్, కేటీఆర్ , హరీష్ రావులను ప్రశ్నిస్తున్నాను .. మీ ఇంట్లో ఆడవాళ్లను ఇలాగే ట్రోల్ చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి.. మీరు పదేళ్లు మంత్రులుగా ఉన్నారు.. మహిళలను గౌరవించడం మీ బాధ్యత అని పేర్కొన్నారు. సురేఖ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నేత హరీశ్ రావు స్పందిస్తూ.. ‘మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అని అన్నారు. "వారి పట్ల అగౌరవాన్ని ఎవరూ సహించరు. @IKondaSurekha బాధకు నేను సానుభూతి తెలుపుతున్నాను. సోషల్ మీడియాలో ఇటువంటి దుష్ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాను. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని నేను కోరుతున్నాను" అని పేర్కొన్నారు.
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ? ప్రకాశ్ రాజ్ కామెంట్స్
తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్.. ఇప్పుడు నాగ చైతన్య, సమంతల విడాకుల గురించి కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖ వీడియో క్లిప్‌ను షేర్ చేసిన ప్రకాశ్ రాజ్.. 'ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ?.. #justasking' అంటూ కామెంట్ చేశారు.
- Akkineni Naga Chaitanya
- Akkineni Nagarjuna
- BJP
- Bharatiya Rashtra Samithi
- Chaitu
- Congress Party
- Drugs
- Film Industry
- Harish Rao
- KCR
- KT Rama Rao
- KTR
- Konda
- Konda Surekha
- Mattupadas
- N Convention
- Naga Chaitanya
- Naga Chaitanya Samanta Divorce
- Phone tapping
- Raghu Nandan Rao
- Revanth Reddy
- Samantha
- Samantha Rutu Prabhu
- Surekha
- Telangana Politics
- Tollywood