కొడంగల్: డిసెంబర్ 4వ తేదీన కొడంగల్ కు వస్తున్న టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ధీటైన సమాధానం చెబుతామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. తొలుత ప్రకటించిన డిసెంబర్ 4వ తేదీ బంద్ ను ఉప సంహరించుకొంటున్నట్టు ఆయన తెలిపారు.

ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  కొడంగల్ ప్రజల అండతో కొండనైనా ఢీకొంటానని ప్రకటించారు. వంద మంది కేసీఆర్‌లు వచ్చినా కూడ కొడంగల్ ప్రజల సహాయంతో పాతాళానికి తొక్కుతానన్నారు. 

కొడంగల్ ప్రజల పౌరుషాన్ని మూటలతో కొనుక్కోవాలనుకొంటున్నారన్నారు. ముఠాలతో కొడంగల్ ప్రజలను బెదిరించాలనుకొంటున్నారన్నారు. అధికారాన్ని, పెత్తనాన్ని తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ కు డిసెంబర్ 4వ తేదీన  సమాధానం చెబుతామన్నారు. 

కేటీఆర్ పై కూడ రేవంత్ విమర్శలు గుప్పించారు.మీ అయ్య గుంట నక్క వేషాలు, మీ బావ తోడేళ్ల వేషాలు వేస్తున్నారని  విమర్శించారు. సిద్దిపేట నుండి ఒకరు, షాబాద్ నుండి ఒకరు, కొడంగల్ నుండి బయలుదేరారని రేవంత్ విమర్శించారన్నారు.

కేసీఆర్‌ పర్యటనలో నిరసన తెలుపుతామన్నారు. కేసీఆర్‌కు మా పదునేందో పట్టుదల ఏందో చూపిస్తాం. కొండగల్‌ నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. గుర్నాథ్‌రెడ్డి లాంటి వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు. చింతమడక చీటర్లకు కొడంగల్‌లో ప్రవేశం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

కొడంగల్ ప్రజల వల్లే.. కేసీఆర్ కి రాజకీయ జీవితం..రేవంత్

ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆ వాహనమే ఎందుకు వాడుతారంటే

అందరి దృష్టి కొడంగల్‌పైనే:ఆ ముగ్గురూ నాన్ లోకల్

రేవంత్ వర్సెస్ పట్నం: గుడికి, గడికి మధ్య పోటీ

సీఎం కుర్చీపై గురి: వ్యూహత్మకంగా రేవంత్ అడుగులు

ఇదిగో డాక్యుమెంట్: సీఎం అవుతారా అంటే రేవంత్ రిప్లయ్ ఇదీ

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్....(వీడియో)

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?