Asianet News TeluguAsianet News Telugu

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఆస్తుల కేసులో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదాయపు పన్ను శాఖ అధికారుల విచారణ ముగిసింది. సుమారు నాలుగున్నర గంటల సేపు విచారించిన ఐటీ శాఖ అధికారులు అనంతరం రేవంత్ రెడ్డిని విడిచిపెట్టారు. 

congress leader revanthreddy comments on it officers enquiry
Author
Hyderabad, First Published Oct 3, 2018, 5:48 PM IST

 

హైదరాబాద్: ఆస్తుల కేసులో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదాయపు పన్ను శాఖ అధికారుల విచారణ ముగిసింది. ఆయకార్ భవన్ లో సుమారు నాలుగున్నర గంటల సేపు విచారించిన ఐటీ శాఖ అధికారులు అనంతరం రేవంత్ రెడ్డిని విడిచిపెట్టారు. రేవంత్ రెడ్డి సమాధానాలను ఐటీ శాఖ అధికారులు వీడియో రికార్డు చేశారు. ఈ కేసుకు సంబంధించి సమాచారం అవసరమైతే ఫోన్ చేస్తామని అందుబాటులో ఉండాలని ఆదేశించారు. 

ఐటీ అధికారుల విచారణ సజావుగా సాగిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఐటీ అధికారులు అడిగిన ప్రతీ ప్రశ్నకు తాను సమాధానం చెప్పానని, తన సమాధానంపై అధికారులు సంతృప్తి చెందారని తెలిపారు. ఈనెల 23న మరోసారి హాజరుకావాలని కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే మధ్యలో ఫోన్ చేస్తామని అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. 

మరోవైపు విదేశీ కంపెనీలు, అకౌంట్ల గురించి తనను ప్రశ్నించలేదని తెలిపారు. తనకు ఎలాంటి షెల్ కంపెనీలు లేవని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్ రావు ప్రైవేట్ సైన్యం మాఇళ్లపై దాడులు చేయిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రణధీర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల పేరుతో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చెయ్యడంపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 

దాడుల పేరుతో ప్రధాని నరేంద్రమోదీ, కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను వెనక్కి తగ్గేది లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర విచార సంస్థలను మోదీ, కేసీఆర్ రాజకీయాలకు ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. 

ఇలాంటి దాడులవల్ల ప్రధాని నరేంద్రమోదీకి, సీఎం కేసీఆర్ కు కలిగే ప్రయోజనం ఏమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు.  

వారం రోజుల క్రితం  రేవంత్ రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖాధికారులు  సుమారు 41 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో లభించిన డాక్యుమెంట్ల ఆధారంగా ఐటీ అధికారులు విచారణకు రావాలని రేవంత్ రెడ్డికి నోటీసులు అందించారు.

రేవంత్ రెడ్డితో పాటు ఓటుకు నోటు కేసులో కీలక నిందితులుగా ఉన్నఉదయ్ సింహ విచారణ కూడా పూర్తైంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఆస్తుల కేసు: ఐటీ అధికారుల విచారణకు కాసేపట్లో రేవంత్ రెడ్డి

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

తప్పు చేస్తే జైలుకెళ్లాల్సిందే : రేవంత్ పై జగదీశ్ రెడ్డి

పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

రేవంత్ చుట్టూ ఉచ్చు: ఉప్పల్ లో తేలిన ఉదయసింహ ఫ్రెండ్ రణధీర్

ఐటి దాడులు: ఉదయసింహ సంచలన ప్రకటన

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

Follow Us:
Download App:
  • android
  • ios