Asianet News TeluguAsianet News Telugu

అందరి దృష్టి కొడంగల్‌పైనే:ఆ ముగ్గురూ నాన్ లోకల్

 ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ లో అసెంబ్లీ నియోజవర్గ పరిధిలోని  ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు కూడ స్థానికేతరులే.

kodangal: non local candidates contesting from kodangal segment
Author
Hyderabad, First Published Nov 28, 2018, 11:09 AM IST

కొడంగల్: ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ లో అసెంబ్లీ నియోజవర్గ పరిధిలోని  ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు కూడ స్థానికేతరులే. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కొందరు ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి మధ్య నువ్వా నేనా  అనే స్థాయిలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థానంలో ఎవరు గెలుపొందుతారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి పై పోటీచేసి విజయం సాధించారు.  ఆ తర్వా 2014 ఎన్నికల్లో  కూడ రెండో సారి టీడీపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 

గత ఏడాది రేవంత్ రెడ్డి టీడీపీని వీడీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొడంగల్ నుండి పోటీ చేస్తున్నారు.  గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన గుర్నాథ్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ దఫా ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా పట్నం నరేంద్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా హాట్ సీటుగా  గుర్తింపు పొందిన ఈ స్థానంలో పోటీ చేస్తున్న ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు  స్థానికేతరులే కావడం గమనార్హం.రేవంత్ రెడ్డి స్వగ్రామం మహాబూబ్  నగర్ జిల్లాలోని అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తోంది.

 రేవంత్ రెడ్డి తొలుత 2009 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో  టీడీపీ తరపున కొడంగల్ నుండి పోటీ చేసే బలమైన అభ్యర్థి లేకపోవడం... గుర్నాథ్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఢీకొడతాడనే  కారణంగా ఆ సమయంలో చంద్రబాబునాయుుడు కొడంగల్ నుండి రేవంత్ రెడ్డిని బరిలోకి దింపాడు.

వరుసగా రెండు దఫాలు ఈ స్థానం నుండి రేవంత్ రెడ్డి విజయం సాధించారు.కొడంగల్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి స్థానికేతరుడని  2009 ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ప్రచారం నిర్వహించారు. 2009లో విజయం సాధించిన తర్వాత కొడంగల్ లోనే రేవంత్ రెడ్డి నివాసాన్ని ఏర్పాటు చేసుకొన్నారు.  ఓ ఇల్లును కట్టుకొన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండేలా అక్కడే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.స్థానికేతరుడని ప్రత్యర్థుల  ప్రచారానికి చెక్ పెట్టేందుకు రేవంత్ వ్యూహత్మకంగా అడుగులు వేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.రేవంత్ స్థానికేతరుడని ప్రత్యర్థులు ప్రచారం చేయకుండా ఉండేందుకు వీలుగా నివాసాన్ని ఏర్పాటు చేసుకొన్నారని కూడ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 మరో వైపు ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి కూడ స్థానికేతరుడే.పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం కాదు.రేవంత్ రెడ్డిన ఢీకొట్టేందుకు  టీఆర్ఎస్ పట్నం నరేందర్ రెడ్డిని  రంగంలో దించింది. ఇక బీజేపీ నుండి పోటీలో ఉన్న నాగూరావు నామాజీ కూడ కొడంగల్ నియోజకవర్గానికి స్థానికేతరుడే. నాగూరావు నామాజీ  నారాయణపేట నియోజకవర్గం . గతంలో ఆయన కుటుంబసభ్యులు నారాయణపేట మున్సిఫల్ చైర్మెన్ గా పనిచేశారు.

రాష్ట్రంలో హాట్ సీటుగా పేరొందిన కొడంగల్ లో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా స్థానికేతరులే.  అయితే కొడంగల్ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులు కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులు గా బరిలో ఉన్నారు. వీరంతా పోటీలో  ఉన్న పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు ఉండవు.

 

సంబంధిత వార్తలు

రేవంత్ వర్సెస్ పట్నం: గుడికి, గడికి మధ్య పోటీ

సీఎం కుర్చీపై గురి: వ్యూహత్మకంగా రేవంత్ అడుగులు

ఇదిగో డాక్యుమెంట్: సీఎం అవుతారా అంటే రేవంత్ రిప్లయ్ ఇదీ

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్....(వీడియో)

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

 

Follow Us:
Download App:
  • android
  • ios