Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

టీఆర్ఎస్‌కు  వ్యతిరేకంగా  గొంతు విప్పుతున్న విపక్షపార్టీలకు చెందిన  నేతలను  అసెంబ్లీకి రాకుండా చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఈ బాధ్యతలను  హరీష్‌, కవితలకు అప్పగించారు

Harish & Kavitha giant killers for KCR's bitter rivals
Author
Hyderabad, First Published Nov 13, 2018, 4:06 PM IST

హైదరాబాద్: టీఆర్ఎస్‌కు  వ్యతిరేకంగా  గొంతు విప్పుతున్న విపక్షపార్టీలకు చెందిన  నేతలను  అసెంబ్లీకి రాకుండా చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఈ బాధ్యతలను  హరీష్‌, కవితలకు అప్పగించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలోనూ, బయట రేవంత్ రెడ్డి గళం విప్పారు. టీడీపీలోనూ, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కూడ రేవంత్ రెడ్డి  కేసీఆర్‌పై విమర్శల దాడిని కొనసాగించారు.కేస

టీడీపీ నుండి  కాంగ్రెస్  పార్టీలో రేవంత్ చేరిన సమయంలో  ఎమ్మెల్యే పదవికి  రాజీనామా సమర్పించారు. ఈ రాజీనామా లేఖను ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అందించారు. ఆ సమయంలో కొడంగల్ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే  అవకాశం ఉందని భావించిన  టీఆర్ఎస్  అక్కడ ఐదుగురు మంత్రులను బరిలోకి దింపింది.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని  టీఆర్ఎస్‌ బరిలోకి దింపింది. అసెంబ్లీ రద్దు కాక ముందు నుండే  కొడంగల్‌లో  పట్నం నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు.

రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరులు కొందరిని ఆ సమయంలోనే టీఆర్ఎస్‌లోనే చేర్చుకొన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున  రేవంత్ తరపున ఆయన సోదరుడు ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

టీఆర్ఎస్  అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి తరపున మంత్రి మహేందర్ రెడ్డితో పాటు  తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి  హరీష్ రావు కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడించే మిషన్‌ను  హరీష్‌కు అప్పగించారు. కొడంగల్‌లో  గతంలో హరీష్ రావు విస్తృతంగా పర్యటించారు. కొడంగల్‌లో రేవంత్‌‌ను ఓడించేందుకు హరీష్ ప్లాన్ ప్రకారంగా కొడంగల్ నేతలు నడుచుకొంటున్నారు.

ఉమ్మడి కరీంనగర్  జిల్లాలోని జగిత్యాల నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి మరోసారి ఇదే నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిని ఓడించే బాధ్యతను నిజమాబాద్ ఎంపీ కవిత తన భుజాల మీద వేసుకొన్నారు.

జగిత్యాల నియోజకవర్గంలో  కవిత విస్తృతంగా పర్యటిస్తున్నారు. జీవన్ రెడ్డిని  ఓడించేందుకు కవిత ఆ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో మరో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి డికే అరుణ ఉమ్మడి మహాబూబ్‌నగర్  జిల్లాలోని గద్వాల నుండి  ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గద్వాలలో డీకే అరుణను ఓడించే బాధ్యతను  హరీష్‌రావు తన భుజాన వేసుకొన్నారు.

డీకే అరుణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా  కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి డీకే అరుణపై ఓటమి పాలయ్యారు.

ఈ దఫా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీకే అరుణను ఓడించే  బాధ్యతలో హరీష్ రావు వ్యూహ రచన చేస్తున్నారు.ఈ మేరకు ఇటీవల గద్వాలలో  హరీష్ రావు ప్రచారం నిర్వహించారు.గద్వాలలో ఏ రకంగా ప్రచారం నిర్వహించాలనే దానిపై  ప్లాన్ చేశారు.

కొడంగల్, గద్వాల నియోజకవర్గాల్లో  కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి,  డీకే అరుణలను  ఓడించే బాధ్యతను హరీష్ తన భుజాన వేసుకొన్నారు. మరో వైపు గజ్వేల్ లో   సీఎం కేసీఆర్  ప్రచారాన్ని కూడ హరీష్ రావు చూస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే జగిత్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో  కవిత కేంద్రీకరించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే జగిత్యాలలో కవిత ఈ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

 

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

 

 

Follow Us:
Download App:
  • android
  • ios