Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్ నుంచి ఈ రోజు ఆయన రోడ్ షో చేపట్టారు

revantreddy comments on telangana cm kcr
Author
Hyderabad, First Published Sep 30, 2018, 3:07 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్ నుంచి ఈ రోజు ఆయన రోడ్ షో చేపట్టారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే తనపై ఐటీ దాడులు చేయించారని ఆరోపించారు. తన ఇంట్లో ఐటీ దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

ఇసుక మాఫియా లారీల కింద పడి దళితులు మరణిస్తుంటే.. వారి శవాలపై వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను ఓడించేందుకు ఊరూరా ప్రచారం చేస్తానని రేవంత్ అన్నారు.

ప్రజల కలను నెరవేర్చి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించి.. దోపిడి పాలనను అంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మందికి పైగా చనిపోతే కనీసం కేసీఆర్ బాధితులను పరామర్శించకపోవడం ఆయన నైజాన్ని మరోసారి బయటపెట్టిందని ఇదే రోడ్‌షోలో షబ్బీర్ అలీ అన్నారు.
 

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

తప్పు చేస్తే జైలుకెళ్లాల్సిందే : రేవంత్ పై జగదీశ్ రెడ్డి

పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

కొనసాగుతున్న రేవంత్ విచారణ: ఆ కంప్యూటర్లో ఏముంది?

రేవంత్ భార్యతో లాకర్లు తెరిపించిన అధికారులు

Follow Us:
Download App:
  • android
  • ios