హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చిందా అంటే వచ్చిందని అంటున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాల నివాసాల్లో ఐటీ సోదాలే అందుకు నిదర్శనమంటున్నారు. ఐటీ దాడులని పైకి చెప్తున్నా అవి ఓటుకు నోటు కేసులో దాడులేనని అంతా భావిస్తున్నారు. 

అయితే ఈ ఓటుకు నోటు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరుసలేం మత్తయ్య స్పష్టం చేశారు. తార్నాకలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మత్తయ్య ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనను వేధిస్తున్నాయని తెలిపారు. 

రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు పేరుతో క్రిస్టియన్ అయిన తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విచారణను వేగవంతం చేసి అసలు నేరస్థులకు శిక్ష విధించి కేసు కొట్టేయ్యాలని డిమాండ్ చేశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

తప్పు చేస్తే జైలుకెళ్లాల్సిందే : రేవంత్ పై జగదీశ్ రెడ్డి

పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు