తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే తనకు పోయేదేమీ లేదని...హాయిగా ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖానాపూర్ ప్రచార సభలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. కేసీఆర్ తన ఓటమిని ముందే గ్రహించి ఈ వ్యాఖ్యలు చేశారని మహాకూటమి నాయకులు పేర్కొంటున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్  వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాస్త ఘాటుగా స్పందించారు.  

తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోతే కేసీఆర్ ఇంటికిపోతాననడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శమని రేవంత్ అన్నారు. టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి ధర్మాన్ని నెరవేర్చొచ్చు కదా అని రేవంత్ సూచించారు. కానీ వారు ఆ పని చేయడానికి సిద్దంగా లేరని...కేసీఆర్ ఇంటికి, కేటీఆర్ అమెరికాకు పోతానంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో లేకపోతే ప్రజలకు సేవ చేయరా అంటూ రేవంత్ వారిని ప్రశ్నించారు. 

నాలుగున్నరేళ్ల పాలనలో కేటీఆర్ అనేక అక్రమాలకు పాల్పడినట్లు రేవంత్ ఆరోపించారు. అందువల్ల ఎక్కడ తన ఆర్థిక నేరాలు బైటపడతాయోనని పారిపోయేందుకు ముందుగానే పథకం రచించాడని పేర్కొన్నారు. అందువల్ల ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి...పాస్ పోర్టును స్వాదీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ సూచించారు.

తండ్రీ కొడుకులిద్దరు బిల్లా రంగాల  వంటివారని రేవంత్ ఘాటు విమర్శలకు దిగారు. కొడంగల్ తనకు సవాల్ విసిరిన కేటీఆర్ కు రేవంత్ మరో సవాల్ విసిరారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్‌ నగర్‌ స్థానం ఇద్దరం పోటీపడి ఎవరి దమ్ము ఎంటో తేల్చుకుందామని...అందుకు కేటీఆర్ సిద్దమా అంటూ రేవంత్ ఛాలెంజ్ చేశారు. 

మరిన్ని వార్తలు

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్....(వీడియో)

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?