Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

ఓటుకు నోటు కేసులో నిందితులైన ఉదయసింహ, సెబాస్టియన్ నివాసాల్లోనూ సోదాలు జరగడం, ఉదయసింహ.. రేవంత్ రెడ్డిలను కలిపి విచారించడం వల్ల ఓటుకు నోటు కేసుపైనే అధికారులు దృష్టి సారించారనే వాదనకు బలం చేకూరుతోంది.

Chandrababu may be in trouble: Report
Author
Hyderabad, First Published Sep 30, 2018, 9:31 AM IST

హైదరాబాద్: ఓ తెలుగు దినపత్రికలో ఆదివారం ఉదయం వచ్చిన వార్తాకథనం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నివాసాల్లో జరిగిన ఐటి సోదాలు, ఆయన విచారణ ప్రధానంగా ఓటుకు నోటు కేసుపైనే సాగిందని ఆ పత్రిక రాసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకునే రేవంత్ రెడ్డి విచారణ సాగిందని ఆ పత్రిక రాసింది. 

రామారావు అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదుతో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే విషయంలో రేవంత్ రెడ్డి ఇంట్లోనూ ఆయన బంధువుల ఇంట్లోనూ సోదాలు జరిగాయనే అందరూ భావిస్తున్న తరుణంలో ఓటుకు నోటు కేసుపైనే అధికారులు ప్రధానంగా దృష్టి సారించారంటూ ఆ పత్రిక రాసిన వార్తాకథనం సంచలనంగా మారింది. 

ఓటుకు నోటు కేసులో నిందితులైన ఉదయసింహ, సెబాస్టియన్ నివాసాల్లోనూ సోదాలు జరగడం, ఉదయసింహ.. రేవంత్ రెడ్డిలను కలిపి విచారించడం వల్ల ఓటుకు నోటు కేసుపైనే అధికారులు దృష్టి సారించారనే వాదనకు బలం చేకూరుతోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి అప్పట్లో నామినేటెడ్ ఎమ్మెల్యే సెబాస్టియన్ కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని సంబంధిత అధికారులు పదే పదే ప్రశ్నించినట్లు చెబుతున్నారు. 

దాదాపు 43 గంటల విచారణ తర్వాత అక్టోబర్ 3వ తేదీన విచారణకు తమ ముందు హాజరు కావాలని అధికారులు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ప్రశ్నలే ఐటి అధికారులు రేవంత్ రెడ్డికి వేసినట్లు చెబుతున్నారు. స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, పార్టీ నిధులా (అప్పట్లో రేవంత్ రెడ్డి టీడీపిలో ఉన్నారు), పార్టీ నిధుల నుంచి వాడారా, మరెవరి నుంచి ఆ నిధులు వచ్చాయి, ముఖ్య నేత నుంచి తీసుకున్నారా, మీ చేతికి ఎవరిచ్చారు వంటి ప్రశ్నలను రేవంత్ రెడ్డికి అధికారులు సంధించినట్లు ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి రాసింది. 

ఓటుకు నోటు కేసులో నిందితులైన ఉదయసింహ, సెబాస్టియన్లను అక్టోబర్ 1వ తేదీన విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు. రేవంత్ రెడ్డిని 3వ తేదీన హాజరు కావాలని చెప్పారు. దీన్ని బట్టి కూడా ఓటుకు నోటు కేసుపైనే అధికారులు దృష్టి పెట్టారనే వాదనకు బలం చేకూరుతోంది. స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన రూ.50 లక్షల రూపాయలు గురించి, దాని వెనక ఉన్న వ్యక్తుల గురించి అక్టోబర్ 1వ తేదీన సెబాస్టియన్, ఉదయసింహల నుంచి సమాచారం రాబట్టి, దాని ఆధారంగా రేవంత్ రెడ్డిని 3వ తేదీన ప్రశ్నించాలనే ఉద్దేశంతో అధికారులు ఉన్నారని చెబుతున్నారు. ఈ స్థితిలో చంద్రబాబుకు కూడా చిక్కులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు

నా కళ్లలోకి చూసి కేసిఆర్ భయపడుతున్నారు: రేవంత్

పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...

రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు: న్యాయవాది రామారావు చరిత్ర ఇదీ...

ఐటి సోదాలు: రేవంత్ ఇంటి వద్ద పరిస్థితి (ఫొటోలు)

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

రేవంత్ ఇంట్లో ఐటీ దాడులపై చంద్రబాబు స్పందన ఇది

కొనసాగుతున్న రేవంత్ విచారణ: ఆ కంప్యూటర్లో ఏముంది?

రేవంత్ భార్యతో లాకర్లు తెరిపించిన అధికారులు

రేవంత్ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి ఆరా తీస్తున్న ఐటీ అధికారులు

24 గంటలుగా సోదాలు.. రాత్రంతా రేవంత్‌పై ప్రశ్నల వర్షం

రేవంత్ రెడ్డి లావాదేవీల చిట్టా ఇదే: గుట్టు విప్పిన న్యాయవాది

రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు: వేయికోట్ల దాకా అక్రమార్జన?

అప్పుడు నా కూతురి లగ్న పత్రిక రోజే...ఇప్పుడు మళ్లీ : రేవంత్ ఆవేదన

జైలు నుంచే నామినేషన్ వేస్తా.. రేవంత్ రెడ్డి

కొడంగల్ కార్యకర్తల వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్

తాళాలు పగలకొట్టి మరీ రేవంత్ ఇంట్లోకి అధికారులు

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...

 

Follow Us:
Download App:
  • android
  • ios