Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆ వాహనమే ఎందుకు వాడుతారంటే

  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  ఎన్నికల ప్రచారానికి క్వాలీస్ వాహానాన్ని ఉపయోగిస్తారు

why revanth reddy using qualis vehicle for election campaign
Author
Kodangal, First Published Dec 1, 2018, 5:10 PM IST


కొడంగల్:  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  ఎన్నికల ప్రచారానికి క్వాలీస్ వాహానాన్ని ఉపయోగిస్తారు. తొలిసారిగా తన ఎన్నికల ప్రచారంలో  ఉపయోగించిన ఆ వాహనం వల్ల గెలుపుకు దోహదపడిందనే సెంటిమెంట్‌తో ప్రతి ఎన్నికల్లో క్వాలీస్ వాహానాన్ని రేవంత్ రెడ్డి ఉపయోగిస్తారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని మిడ్జిల్  జడ్పీటీసీ సభ్యుడిగా రేవంత్ రెడ్డి  2005 ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో  రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ మినహా టీడీపీ, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు కూడ రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచాయి. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా విజయం సాధించారు. ఆ ఎన్నికల సమయంలో  కల్వకుర్తి  ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డికి వ్యతిరేకంగా ఈ పార్టీలన్నీ కలిసి రేవంత్ రెడ్డికి మద్దతిచ్చాయి.  ఈ పార్టీలను ఏకం చేయడంలో రేవంత్ ఆ సమయంలో  సక్సెస్ అయ్యారు. 

కల్వకుర్తి నియోజకవర్గం నుండి  గతంలో రేవంత్ రెడ్డి మామ మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  జైపాల్ రెడ్డికి,  ఎడ్మ కిష్టారెడ్డికి పొసగదు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడ ఎవరి దారి వారిదే.

మిడ్జిల్ జడ్పీటీసీగా రేవంత్ రెడ్డి ఎన్నికైన కొంత కాలానికే మహబూబ్ నగర్  జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ తర్వాత  ఎక్కువ స్థానాలు టీడీపీకే ఉన్నాయి. అయితే  ఈ ఎన్నికల్లో  రేవంత్ రెడ్డి మరోసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాడు.

అయితే ఆ సమయంలో టీడీపీ మద్దతును కోరారు. టీడీపీ మద్దతుతో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే  టీడీపీలో చేరుతానని చంద్రబాబునాయుడుకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.   ఆ ఎన్నికల సమయంలో  ప్రస్తుత టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేందర్ రెడ్డి,  మాజీ మంత్రి  నాగం జనార్ధన్ రెడ్డిలు టీడీపీలో ఉన్నారు.  జితేందర్ రెడ్డి ఇంట్లోనే రేవంత్ రెడ్డి ఫోన్ లో చంద్రబాబునాయుడుతో ఫోన్ లో మాట్లాడారు.

ఇండిపెండెంట్‌గా  బరిలో ఉన్న సమయంలో మహబూబ్ నగర్  పట్టణంలోని  ఓ హోటల్‌లో క్యాంపు ఏర్పాటు చేసుకొని రేవంత్ రెడ్డి  ఎన్నికల వ్యూహాన్ని రచించారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటర్లను కూడ   తన వైపుకు తిప్పుకొన్నారు. కాంగ్రెస్ పార్టీకి  పూర్తి మెజారిటీ ఉన్నా రేవంత్ రెడ్డి  ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఈ ఎన్నికల సమయంలో కూడ రేవంత్ రెడ్డి క్వాలీస్ వాహనాన్ని ఉపయోగించారు.

ఎమ్మెల్సీగా రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబునాయుడును కలిసి టీడీపీలో చేరారు.  టీడీపీలో చేరిన తర్వాత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి  ఎదిగారు. 2009 ఎన్నికల్లో  కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ టికెట్టు రేవంత్ రెడ్డికి దక్కింది. ఆ ఎన్నికల సమయంలో కూడ రేవంత్ రెడ్డి క్వాలీస్ వాహనాన్ని ఉపయోగించారు. 

ఏ ఎన్నికల్లో కూడ ప్రచారానికి రేవంత్ రెడ్డి ఈ వాహనాన్ని ఉఫయోగిస్తారు.  ఇతర సమయాల్లో  మోడ్రన్ వాహనాల్లో తిరిగినా ఎన్నికల ప్రచారానికి మాత్రం రేవంత్ రెడ్డి ఈ వాహనాన్ని ఉపయోగిస్తారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

సంబంధిత వార్తలు

అందరి దృష్టి కొడంగల్‌పైనే:ఆ ముగ్గురూ నాన్ లోకల్

రేవంత్ వర్సెస్ పట్నం: గుడికి, గడికి మధ్య పోటీ

సీఎం కుర్చీపై గురి: వ్యూహత్మకంగా రేవంత్ అడుగులు

ఇదిగో డాక్యుమెంట్: సీఎం అవుతారా అంటే రేవంత్ రిప్లయ్ ఇదీ

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్....(వీడియో)

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

 

Follow Us:
Download App:
  • android
  • ios