దమ్ము, ధైర్యం ఉంటే  తనపై పోటీ చేసి రేవంత్ రెడ్డి విజయం సాధించాలని  టీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి  సవాల్ విసిరారు.


కొడంగల్: దమ్ము, ధైర్యం ఉంటే తనపై పోటీ చేసి రేవంత్ రెడ్డి విజయం సాధించాలని టీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు. కొడంగల్ నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి రెండు దఫాలు రేవంత్ రెడ్డి విజయం సాధించారని ఆయన విమర్శించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి పలు విషయాలను వెల్లడించారు.రేవంత్ రెడ్డి చేసే తప్పుడు ప్రచారాన్ని కొడంగల్ ప్రజలు నమ్మేందుకు సిద్దంగా లేరని ఆయన అభిప్రాయపడ్డారు.ః

కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే తాను సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్టు రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకొంటున్నారని చెప్పారు. ఈ ప్రచారాన్ని నమ్మి ప్రజలు తనకు ఓట్లు వేస్తారని రేవంత్ రెడ్డి భ్రమలో ఉన్నారని పట్నం నరేంద్ర్ రెడ్డి చెప్పారు.

తనను ఓడించేందుకు డీజీపీ , కేసీఆర్‌ వంద కోట్లు డీల్ కుదుర్చుకొన్నారని రేవంత్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రేవంత్‌ను ఓడించేందుకు సీఎం ప్లాన్ చేస్తాడా అని ఆయన ప్రశ్నించారు.

 రేవంత్ రెడ్డి వల్లే కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి కాలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.300 కోట్లతో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు పట్నం నరేందర్ రెడ్డి చెప్పారు.

ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు సంపాదించడం రేవంత్ రెడ్డికే చెల్లిందన్నారు.ఈ దఫా మాత్రం రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?