హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పైర్ బ్రాండ్‌గా పేరొందిన రేవంత్ రెడ్డి ప్రజా కూటమి అధికారంలోకి వస్తే సీఎం పీఠంపై  కన్నేశాడు. ఈ మేరకు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాడు. రాజకీయంగా ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేయడమే కాదు ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు ఉంటే  తాను  ఏం చేస్తాననే విషయాన్ని వివరించారు. పరిపాలన అనుభవం లేదనే  ప్రత్యర్థుల విమర్శలకు రేవంత్   పాలసీ డాక్యుమెంట్ ను విడుదల చేశారు. ప్రజల అవసరాలు తీర్చడంలో  తనకు ఓ విజన్ ఉందని  రేవంత్  వివరించే ప్రయత్నం చేశారు.

రాజకీయాల్లో అనతికాలంలోనే  రేవంత్ రెడ్డి  ఎదిగారు.జడ్పీటీసీ స్థాయి నుండి శాసనసభపక్ష నాయకుడిగా ఎదిగారు. ఇండిపెండెంట్ గా కల్వకుర్తి నియోజకవర్గంలో  జడ్పీటీసీగా విజయం సాధించారు.ఆ తర్వాత మహాబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో  ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు.

2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా  పోటీ చేసి కొడంగల్ నుండి విజయం సాధించారు.  గత ఎన్నికల్లో ఇదే స్థానం నుండి ఆయన మరోసారి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. గత ఏడాదిలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఆ పార్టీని వీడి  కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కూడ రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్  పదవిని  కట్టబెట్టింది.

సీఎం పదవే లక్ష్యంగా రేవంత్ రెడ్డి  2014 ఎన్నికల నుండి వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాడు.తన రాజకీయ జీవితంలో సీఎం పదవిని అధిష్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. ప్రత్యర్థులపై తన పదునైన విమర్శలతో చీల్చి చెండాడే రేవంత్ రెడ్డి  పీపుల్స్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే తాను ఏం చేయదల్చుకొన్నాననే అంశాలను మీడియాకు విడుదల చేశారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టో కాకుండా రేవంత్ రెడ్డి  ఓ డాక్యుమెంట్ ను  విడుదల చేయడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. ముఖ్యమంత్రి లేదా ఇతర కీలకమైన పదవుల్లో  ఉన్నవారైతే  ఈ రకమైన హమీలను అమలు చేసే అవకాశం ఉంటుంది.

ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించిన సమయంలో  సీఎంను ఎవరనేది ఎమ్మెల్యేలు, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొంటుంది...  కానీ ఈ తరహా  డాక్యుమెంట్ అమలు కోసం పార్టీలో రెండో స్థానంలో ఉన్న తాను  ఈ డాక్యుమెంట్ ను అమలు చేసేందుకు  తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. పీపుల్స్ ఫ్రంట్ ఉమ్మడి కార్యాచారణను కూడ విడుదల చేసింది. ఈ రెండింటితో పాటు రేవంత్ రెడ్డి విడుదల చేసిన  డాక్యుమెంట్ ను అమలు చేయడం సాధ్యమయ్యే పనేనా అనే చర్చ కూడ లేకపోలేదు.

అయితే రేవంత్ రెడ్డి రాజకీయంగా విమర్శలు చేయడమే కాదు పరిపాలన అనుభవం లేదని తనను సీఎం సీటుకు దూరంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నవారికి   రేవంత్ రెడ్డి  డాక్యుమెంట్ రూపంలో చెక్ పెట్టారనే అభిప్రాయాలు కూడ విన్పిస్తున్నాయి.

ఎన్టీఆర్, రాజీవ్ గాంధీలు కూడ ఎలాంటి పాలన అనుభవం లేకున్నా అత్యంత ప్రజా రంజకంగా పాలన చేసిన విషయాన్ని రేవంత్ గుర్తు చేస్తున్నారు. ఇప్పటివరకు  మంత్రి పదవి రేవంత్ రెడ్డి చేపట్టలేదు. మంత్రి పదవిని చేపట్టకున్నా  ప్రజలకు సేవల చేయాలనే తపన ఉంటే  తాను చేస్తాననే పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

ఆర్టీసీ, జర్నలిస్టు, పోలీసులతో  పాటు మహిళలకు , రైతులకు ఏం చేయనున్నామో రేవంత్ రెడ్డి ఈ డాక్యుమెంట్లో  స్పష్టం చేశారు.   పాలన అనుభవం లేదని విమర్శలు చేస్తున్న ప్రత్యర్థులకు ఈ డాక్యుమెంట్ ద్వారా తాను కూడ సీఎం రేసులో ఉన్నాననని రేవంత్  స్సష్టత ఇచ్చారు.

సీఎం పదవిని చేపట్టే ఉద్దేశ్యంతోనే రేవంత్ రెడ్డి  వ్యూహత్మకంగా వేస్తున్న అడుగుల్లో భాగంగానే  ఈ డాక్యుమెంట్ ను విడుదల చేసినట్టు   ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. 


సంబంధిత వార్తలు

ఇదిగో డాక్యుమెంట్: సీఎం అవుతారా అంటే రేవంత్ రిప్లయ్ ఇదీ

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్....(వీడియో)

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?