Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ వర్సెస్ పట్నం: గుడికి, గడికి మధ్య పోటీ

ఉమ్మడి మహబూబ్‌నగర్  జిల్లాలోని  కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నందారం ఫ్యామిలీ ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీ, ఆ అభ్యర్థి విజయం సాధించే  అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Nandaram family key role in kodangal assembly segment
Author
Kodangal, First Published Nov 24, 2018, 6:05 PM IST


కొడంగల్: ఉమ్మడి మహబూబ్‌నగర్  జిల్లాలోని  కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నందారం ఫ్యామిలీ ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీ, ఆ అభ్యర్థి విజయం సాధించే  అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం టీడీపీలో నందారం అనురాధ ఉన్నారు.  

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో గడికి, గుడికి మధ్య పోటీ అనే ప్రచారం ఉండేది. గుడి అంటే నందారం ఫ్యామిలీ.  తిరుపతి వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని పోలిన  ఆలయాన్ని నందారం ఫ్యామిలీ కొడంగల్‌లో నిర్మించింది. ఇక గడి అంటే  కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డిని పిలిచేవారు.

కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో వీరిద్దరి మధ్య  పోటా పోటీగా రాజకీయాలు సాగేవి.   1972లో నందారం వెంకటయ్య  ఇండిపెండెంట్ గా కె.ఎస్ రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత  1985లో నందారం వెంకటయ్య టీడీపీ అభ్యర్థిగా  పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గుర్నాధరెడ్డిపై  విజయం సాధించారు.
1989లో రతన్ లాల్ లావోటీకి టీడీపీ టికెట్టు కేటాయించింది.ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి గుర్నాథరెడ్డి విజయం సాధించారు.

1994లో నందారం వెంకటయ్యకు టీడీపీ టికెట్టు కేటాయించింది.  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గుర్నాధర్ రెడ్డిపై వెంకటయ్య మరోసారి విజయం సాధించారు.నందారం వెంకటయ్య మరణంతో 1996 లో ఉప ఎన్నికలు జరిగాయి.  ఈ ఉప ఎన్నికల్లో  నందారం సూర్యనారాయణ విజయం సాధించారు.

2009 ఎన్నికల్లో  కొడంగల్ అసెంబ్లీ ఎన్నికల్లో  ఎమ్మెల్సీగా ఉన్న రేవంత్ రెడ్డి   బరిలోకి దిగారు. ఆ సమయంలో  నందారం అనురాధతో తొలుత రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.ఆమెను ఒప్పించి కొడంగల్ నుండి బరిలోకి దిగి విజయం సాధించారు. 2014లో కూడ రేవంత్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుండి  టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు.

టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత కూడ రేవంత్ రెడ్డి తన భార్యతో కలిసి నందారం అనురాధ కుటుంబసభ్యులను కలిశారు.  రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసిన సమయంలోనే కొడంగల్ స్థానానికి ఉప ఎన్నికలు  జరుగుతాయనే  ప్రచారం సాగింది. ఒకవేళ ఆ సమయంలో  ఉప ఎన్నికలు జరిగితే నందారం అనురాధ కొడుకు డాక్టర్ మల్లిఖార్జున్ బరిలోకి దింపాలని టీడీపీ భావించింది.

కానీ, ఆ సమయంలో ఎన్నికలు జరగలేదు.ప్రస్తుతం ప్రజా కూటమి( మహాకూటమి)లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌లు భాగస్వామిగా ఉన్నాయి.  ఈ కూటమిలో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కూటమి ధర్మం ప్రకారంగా  టీడీపీ కూడ రేవంత్ రెడ్డికి  మద్దతివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం కొడంగల్ లో జరిగిన కేటీఆర్ రోడ్ షో లో నందారం అనురాధ సమీప బంధువు నందారం రాజు టీఆర్ఎస్ లో చేరారు. నందారం ఫ్యామిలీ ఎటువైపు మొగ్గు చూపితే  కొడంగల్ లో ఆయా పార్టీలు, అభ్యర్థుల గెలుపు ఓటములపై  ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే 2014 ఎన్నికల సమయంలో గుర్నాథరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. మాజీ ఎంపీ విఠల్ రావు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ ఇద్దరు ఉద్ధండులపై రేవంత్ విజయం సాధించారు.గుర్నాథ్ రెడ్డి ఈ దఫా పోటీ చేయడం లేదు. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి మద్దతుగా గుర్నాథ్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. నందారం అనురాధ కుటుంబం కూడ ఈ దఫా బరిలో లేదు. ప్రజాకూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉన్నందున రేవంత్ రెడ్డికి నందారం కుటుంబం మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.

 

సంబంధిత వార్తలు

 

సీఎం కుర్చీపై గురి: వ్యూహత్మకంగా రేవంత్ అడుగులు

ఇదిగో డాక్యుమెంట్: సీఎం అవుతారా అంటే రేవంత్ రిప్లయ్ ఇదీ

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్....(వీడియో)

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

 

Follow Us:
Download App:
  • android
  • ios