Asianet News TeluguAsianet News Telugu

పైకి మామూలు ఇళ్లే.. లోపల వ్యభిచారం, ఒకేసారి రెండు చోట్ల గుట్టురట్టు

వ్యభిచార గృహాలపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు. ఆదివారం జగద్గిరిగుట్టలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో నలుగురు విటులతో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

prostitution racket busted in hyderabad ksp
Author
Hyderabad, First Published Mar 7, 2021, 5:29 PM IST

వ్యభిచార గృహాలపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు. ఆదివారం జగద్గిరిగుట్టలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో నలుగురు విటులతో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. గాజులరామారంలోని మహదేవపురం కాలనీలో ఓ ఇంటిలో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు.

సెల్‌ఫోన్‌ ద్వారా నిర్వాహకులు విటులకు ఫోన్‌చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఐదు సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులతో పాటు విటులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక మరో ఘటనలో బాలానగర్‌‌లోని వ్యభిచార గృహంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. జగద్గిరిగుట్ట పీఎస్‌ పరిధిలోని కమల ప్రసూన నగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వ్యభిచార గృహం నిర్వాహకుడు హరీష్‌ , విటుడు విజేందర్‌ లతో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం హరీష్, విజేందర్‌లపై కేసు నమోదు చేసి ఇద్దరు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios