అనుపమా పరమేశ్వరన్‌ విలక్షణ నటిగా మారిపోతుంది. మొన్న `టిల్లు స్వ్కేర్‌`లో బోల్డ్ గా కనిపించి షాకిచ్చింది. ఇప్పుడు `పరదా`లో సరికొత్త లుక్‌లో మతిపోగొడుతుంది.  

అనుపమా పరమేశ్వరన్‌ మొన్నటి వరకు హోమ్లీ బ్యూటీగా మెప్పించింది. కానీ `టిల్లు స్వ్కేర్‌`తో అందరికి షాకిచ్చింది. బోల్డ్ రోల్లో నటించి మతిపోగొట్టింది. లిప్‌ లాకులు, బెడ్‌సీన్లతోనూ రెచ్చిపోయింది. రొమాంటిక్‌ సీన్లతో రచ్చ చేసి ఆమె అభిమానుల గుండెల్ని బ్రేక్‌ చేసింది. కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. `టిల్లు స్వ్కేర్‌`లో లిల్లీగా అనుపమా పరమేశ్వరన్‌ చేసిన రచ్చ నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. 

టిల్లుగాడి లవర్‌తో మతిపోగొట్టిన అనుపమా పరమేశ్వరన్‌ ఇప్పుడు మారిపోయింది. సరికొత్త లుక్‌లో అదరగొడుతుంది. `పరదా` అంటూ మరోసారి హోమ్లీ బ్యూటీగా, గిరిజన మహిళగా కనిపిస్తూ షాకిస్తుంది. ప్రస్తుతం ఆమె ఫస్ట్ లుక్‌ ఆకట్టుకుంటుంది. అనుపమా పరమేశ్వర్‌ ఇప్పుడు `పరదా` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా శుక్రవారం ఈ మూవీ కాన్సెప్ట్ టీజర్‌ విడుదలైంది. అలాగే ఫస్ట్ లుక్ ని రిలీజ్‌ చేశారు.

 ఇందులో శ్రీశ్రీ జ్వాలంబికాదేవి దివ్యజ్యోతి వద్ద పూజలు చేస్తుంటారు. అమ్మవారి ముఖానికి చీరలతో చుట్టేస్తారు. మరోవైపు అక్కడ పండగ వాతావరణం కనిపిస్తుంది. కట్ చేస్తే కొందరు మహిళలు తమ కొంగులతో ముఖాన్ని కప్పేసుకుంటారు. ఒక్క అనుపమా కొంగు మాత్రం కొందకు జారుతూ చివరికి ఆమె పూర్తి ముఖం కనిపిస్తుంది. ఆమె ముఖంలో బాధ, ఆవేదన కనిపిస్తుంది. మహిళలపై అక్కడ జరిగే ఆగడాలపై అనుపమా పరమేశ్వరన్‌ ఎలా తిరగబడిందనే కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కాన్సెప్ట్ గ్లింప్స్ మాత్రం అదిరిపోయేలా ఉంది. 

YouTube video player

`సినిమా బండి` చిత్రంతో ఆకట్టుకున్న ప్రవీణ్‌ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్‌తోపాటు దర్శన, సంగీత ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఆనంద మీడియా పతాకంపై విజయ్‌ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్‌ మక్కువ నిర్మిస్తున్నారు.