MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్హ మా వసపిట్ట.. అల్లు అర్జున్‌ కూతురుపై నిహారికా కామెంట్.. ఇంట్లో ఎలా ఉంటుందో చెప్పిన మెగాడాటర్‌

అల్లు అర్హ మా వసపిట్ట.. అల్లు అర్జున్‌ కూతురుపై నిహారికా కామెంట్.. ఇంట్లో ఎలా ఉంటుందో చెప్పిన మెగాడాటర్‌

అల్లు అర్జున్‌ గారాల పట్టి అల్లు అర్హ బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అర్హ ఇంట్లో ఎలా ఉంటుందో చెప్పింది నిహారిక.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 26 2024, 09:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. కూతురు అల్లు అర్హ చాలా యాక్టివ్‌ అనే విషయం తెలిసిందే. ఆమెకి సంబంధించిన ఫన్నీ వీడియోలను బన్నీ తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని షేర్‌ చేసుకుంటున్నారు. అభిమానులతో ఆ సంతోషాన్ని పంచుకుంటాడు బన్నీ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అల్లు అర్హ ఇంట్లో అల్లరి మామూలుగా ఉండదట. బన్నీ కొడుకు అల్లు అయాన్‌ కాస్త సైలెంట్‌. కూల్‌గా ఉంటాడు. కానీ అర్హ మాత్రం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుందని, నాన్‌ స్టాప్‌గా రన్‌ అవుతూనే ఉంటుందట. బన్నీ కూడా పలు సందర్భాల్లో తెలిపారు. ఇంట్లో అర్హ ఉందంటే సందడే సందడి అని అంటుంటారు. 
 

37

తాజాగా నిహారిక అర్హ గురించి చెప్పింది. బన్నీ తరహాలోనే నిహారిక చెప్పింది. కాకపోతే ఇంట్రెస్టింగ్‌ విషయాలను బయటపెట్టింది. అర్హ తమ వస పిట్ట అని, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుందని చెప్పింది. చాలా క్యూట్‌గా ఉంటుందని, మాటలు కూడా అంతే క్యూట్‌గా ఉంటాయని చెప్పింది మెగా డాటర్. 

47

తనని నిహా అత్త అని పిలుస్తుందట. అందరు పిల్లలు నిహా పిన్ని అని పిలిస్తే తను మాత్రం నిహా అత్తా అని పిలుస్తుందని చెప్పింది. దగ్గరకు వచ్చి ఎంతగానో మాట్లాడుతుందని, రింగులు ఎక్కడ కొన్నావ్‌, నన్నూ తీసుకెళ్తావా? నీ డ్రెస్‌ బాగుంది, నా డ్రెస్‌ బాగుందా అంటూ క్వశ్చన్‌ తనదే, ఆన్సర్ కూడా తనదే అని, మనం మాట్లాడానికి ఏముండదని చెప్పింది. ఫైనల్‌గా చాలా మంచి పిల్ల అని చెప్పింది నిహారికా. తనతో ఉంటే చాలా ఫన్నీగా ఉంటుందని చెప్పింది. ఫుల్‌ టాలెంటెడ్‌ అని, మంచి స్థాయికి వెళ్తుందని వెల్లడించింది మెగాడాటర్‌. ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో అర్హ గురించి చెప్పుకొచ్చింది నిహారిక.

57

 అల్లు అర్హ.. ఆల్‌రెడీ బాలనటిగా సినిమా ఎంట్రీ ఇచ్చింది. సమంత నటించిన `శాకుంతలం`లో బాల భరతుడి పాత్రలో నటించింది అర్హ. తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది. సినిమా క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చి అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది. సినిమాలకే హైలైట్‌గా నిలిచింది. 
 

67

ఇక నిహారిక యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించి హీరోయిన్‌ అయ్యింది. నాలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ సక్సెస్‌ కాలేదు. దీంతో ప్రొడక్షన్‌ స్టార్ట్ చేసింది. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్ ని స్థాపించి వెబ్‌ సిరీస్‌లు నిర్మించింది. ఇప్పుడు `కమిటీ కుర్రాళ్లు` అనే సినిమాని నిర్మిస్తుంది.
 

77
Niharika Konidela

Niharika Konidela

ఇక మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న నిహారిక గతేడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రొడక్షన్‌ పరంగా బిజీ అవుతుంది. నటిగానూ మళ్లీ రీఎంట్రీ ఇస్తుందని సమాచారం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Police Complaint Movie Review: పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ.. వరలక్ష్మి నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Sharvari Wagh: చేసింది 5 సినిమాలే, అయినా 15 కోట్ల లగ్జరీ ఇల్లు.. ఆల్ఫా బ్యూటీ ఆస్తుల గురించి తెలిస్తే షాకే
Recommended image3
Highest Paid Actress: నయనతార, సమంతని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved