హైదరాబాద్:కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో  టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న  సుహాసిని తరపున ప్రచారం చేసేందుకు సినీ నటుడు  జూనియర్ ఎన్టీఆర్ రంగంలో దిగనున్నారు. 

గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధి నుండి 2014 ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్ధిగా మాధవరం కృష్ణారావు పోటీ చేసి విజయం సాధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ ను కలిసిన కృష్ణారావు టీఆర్ఎస్‌లో చేరారు.

దీంతో కూకట్‌పల్లి నుండి  కొత్త అభ్యర్ధిని బరిలోకి దింపాల్సిన పరిస్థితి టీడీపీకి నెలకొంది. సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి నందమూరి హరికృష్ణ కూతురు  సుహాసినిని టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది.

సుహాసిని నామినేషన్ దాఖలు చేసే సమయంలో  బాబాయ్ బాలకృష్ణ వచ్చారు. ఎన్టీఆర్, హరికృష్ణల సమాధుల వద్ద నివాళులు అర్పించిన తర్వాత సుహాసిని కూకట్‌పల్లిలో నామినేషన్ దాఖలు చేశారు.

సుహాసిని ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు.టీడీపీ టికెట్టు ఆశించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, స్థానిక కార్పోరేటర్ మందాడి శ్రీనివాసరావులు కూడ సుహాసిని వెంట ప్రచారంలో ఉన్నారు. 

మరోవైపు సినీ నటుడు  జూనియర్ ఎన్టీఆర్  కూడ సుహాసిని తరుపున విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు.  జూనియర్‌ ఎన్టీఆర్‌ 27 నుంచి మూడు రోజులపాటు పర్యటించనున్నారు. 

కళ్యాణ్ రామ్ కూడ సుహాసిని విజయం కోసం ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 28,29 తేదీల్లో తెలంగాణలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ రెండు రోజుల్లో  కూకట్‌పల్లి నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు రోడ్‌షోలు నిర్వహించే ఛాన్స్  ఉంది.
 

సంబంధిత వార్తలు

కూకట్ పల్లి: నందమూరి సుహాసినీ బలహీనత ఇదీ, బలం అదీ...

బాబు 'సుహాసిని' వ్యూహం: లోకేష్ కు లైన్ క్లియర్, ఎన్టీఆర్ కు స్పేస్

అక్క గెలుపుకు కృషి చేస్తా,పెదనాన్న లేని లోటు పూడ్చుతా:తారకరత్న

జూ.ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు ప్రచారం చేస్తారు: సుహాసిని

చిచ్చు పెడుతున్న చంద్రబాబు: సుహాసిని పోటీపై కేటీఆర్ వ్యాఖ్యలు

సెటిలర్ల ఓట్లకు గాలం: కేసీఆర్ వ్యూహం ఇదీ

చంద్రబాబును ఓసారి నేను తరిమేశాను, ఇప్పుడు మీరు: కేసీఆర్

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్

వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్

కేటీఆర్‌పై కేసు.. ఎన్నికల సంఘానికి నివేదిక

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

ఎవరు స్వీట్లు పంచుకొంటారో చూద్దాం: కేటీఆర్‌కు ఉత్తమ్ కౌంటర్

కేసీఆర్‌, కేటీఆర్‌పై పోటీ చేసే అభ్యర్థులెవరో తెలుసా?

"ఎంపీనో.. ఎమ్మెల్యేనో మరణిస్తేనే పట్టించుకుంటారా"... కేటీఆర్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఘాటైన ట్వీట్‌

ప్రగతి నివేదన సభ: 15 నిమిషాల్లో కేటీఆర్‌కు చొక్కా కుట్టించిన టైలర్

ట్విట్టర్‌లో కాదు మైదానంలో ఆడదాం రా...: కేటీఆర్‌కు రేవంత్ సవాల్