ఖమ్మం: ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టును  నిలిపివేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ రాశాడన్నారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చే చంద్రబాబునాయుడును ప్రశ్నించాలని  ఆయన కోరారు. సీతారామ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాసిన లేఖను  విరమించుకొన్న తర్వాతే ఖమ్మం జిల్లాలో ప్రచారానికి రావాల్సిందిగా కోరారు.

సోమవారం నాడు ఖమ్మంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్  పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలోని ముగ్గురు టీడీప అభ్యర్థులను  సీతారామ ప్రాజెక్టు  విషయమై ప్రజలంతా నిలదీయాలని  కేసీఆర్ కోరారు. సీతారామ ప్రాజెక్టును అడ్డుకొన్న విషయం  వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. సీతారామా  ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొంటామని చెప్పిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని  ఓట్లు అడుగుతాడో చెప్పాలని  ఆయన డిమాండ్ చేశారు.

ఖమ్మం జిల్లాకు చంద్రబాబునాయుడు ప్రచారానికి వస్తే  ప్రజలు నిలదీయాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు విషయమై చంద్రబాబునాయుడు  ఇచ్చిన లేఖను  విరమించుకోవాలని ఆయన సూచించారు.సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తేనే ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతోందన్నారు. కానీ, ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన  టీడీపీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతోందన్నారు.  

రాష్ట్రం బాగుండాలని తాను రాజశ్యామల యాగాన్ని పూర్తి చేసినట్టు చెప్పారు. ఖమ్మంలోని 10 అసెంబ్లీ స్థానాలను  గెలుచుకొంటామని కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.

ఖమ్మం తలపండిన రాజకీయ నేతలున్న జిల్లా అని  కేసీఆర్ గుర్తు చేశారు. ఖమ్మంలోని 10 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో ఏం జరుగుతోందో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమం సమయంలో ఏం  చేస్తామో  అది అమలు చేసి చూపినట్టు చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను  అమలు చేసిన చరిత్ర టీఆర్ఎస్‌దేనని కేసీఆర్ చెప్పారు.

కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హాయంలో కట్టిన ఏడు ఇళ్లతో తాము నిర్మించిన ఒక్క డబుల్ బెడ్‌ రూమ్ ఇల్లు సమానమన్నారు.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై  విపక్షాల విమర్శలు హస్యాస్పదంగా ఉందన్నారు.

కంటి వెలుగును  రాష్ట్రమంతటా  అమలు చేస్తున్నట్టు చెప్పారు.  ఏ కులం, ఏ మతం పేదరికం పోతోందా..... అని  ప్రశ్నించారు. ఇంతకాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీలు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశఆరు. కాంగ్రెస్, టీడీపీలు ప్రాజెక్టుల నిర్మాణాలను విస్మరించినట్టు చెప్పారు. 

ముసుగులో వచ్చే పార్టీలకు ప్రజలు చెంప చెల్లుమనే సమాధానం చెప్పాలని కేసీఆర్ కోరారు.గోదావరి నది  ఖమ్మం జిల్లాలో 150 కి.మీ పారుతున్నా ఎందుకు కరువు ఉంటుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ నీటిలో ఖమ్మం జిల్లాకు ఎందుకు  ఇవ్వలేదో కాంగ్రెస్, టీడీపీ నేతలు చెప్పాలని ఆయన ప్రశ్నించారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో  ప్రాజెక్టుల పేరుతో దోపీడీ చేశారని ఆయన ఆరోపించారు.

టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా  ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్నారు. తాను ఢిల్లీలో చక్రం తిప్పుతానని చెప్పనని పరోక్షంగా చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

బీజేపీ, కాంగ్రెస్ వల్ల దేశానికి న్యాయం జరగలేదన్నారు. అందుకే ఈ పార్టీలకు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు.ఢిల్లీని శాసించే స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉందన్నారురానున్న రెండేళ్లలో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాది నుండి రైతులకు ప్రతి ఎకరానికి  రూ5 వేలను పెట్టుబడి కింద చెల్లిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.