Asianet News TeluguAsianet News Telugu

కూకట్ పల్లి: నందమూరి సుహాసినీ బలహీనత ఇదీ, బలం అదీ...

సుహాసినికి రాజకీయానుభవం లేదు. వక్తృత్వ పటిమ లేదు. ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి అవసరమైన దూకుడు లేదు. తెర మీదికి వచ్చిన తర్వాత సుసహాసిని రెండు మార్లు మాత్రమే మీడియాతో మాట్లాడారు. 

Nandamuri Suhasini weak in oratory skills
Author
Kukatpally, First Published Nov 25, 2018, 11:11 AM IST

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని పేరు అనూహ్యంగా తెర మీదికి వచ్చింది. బహుశా తాను ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తుందని సుహాసిని కూడా ఊహించి ఉండరు. కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమెను కూకట్ పల్లి నుంచి రంగంలోకి దింపారు. 

సుహాసినికి రాజకీయానుభవం లేదు. వక్తృత్వ పటిమ లేదు. ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి అవసరమైన దూకుడు లేదు. తెర మీదికి వచ్చిన తర్వాత సుసహాసిని రెండు మార్లు మాత్రమే మీడియాతో మాట్లాడారు. మొదటిసారి, తనను కూకట్ పల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన రోజు మీడియా ముందుకు వచ్చారు. ఈ మీడియా సమావేశంలో ఆమె తనను, తన కుటుంబాన్ని పరిచయం చేసుకున్నారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఆమె అవకాశం ఇవ్వలేదు. 

రెండోసారి, ఎన్టీఆర్ స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించినప్పుడు మీడియాకు ఎదురు పడ్డారు. మీడియాను ఎదుర్కోవడానికి ఆమె సిద్ధం కాలేదని స్పష్టం అర్థమైంది. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు తడబడ్డారు, మాటల కోసం వెతుక్కున్నారు. ఇవి ఆమె బలహీనతలు.

అయితే, ఆమెకు సామాజిక వర్గం, ఎన్టీఆర్ వారస్తవం బలం. కూకట్ పల్లి నియోజకవర్గంలో కాపులు, కమ్మలు, బీసీలు, ఎస్సీలు ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే, ఆంధ్ర సెటిలర్లు ఎక్కువ. కూకట్ పల్లి నియోజకవర్గంలో 3.17 మంది ఓటర్లు ఉన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో అత్యధికులు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. 

అయితే, టీఆర్ఎస్ తరఫున మాధవరం కృష్ణారావు పోటీ చేస్తున్నారు. కెపిహెచ్ బీ కార్పోరేటర్ హరీష్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దానివల్ల కెపిహెచ్ బీ కాలనీలో ఓట్లు గుండుగుత్తగా సుహాసినికి పడే అవకాశాలు లేవని, ఓట్లు చీలిపోతాయని కృష్ణారావు వర్గం అంటోంది. అయితే, ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ సుహాసిని వైపు కమ్మ సామాజిక ఓటర్లు ఎక్కువ మంది మొగ్గు చూపే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.  

మరో వాదన కూడా ఉంది. కమ్మ ఓటర్లలో కొంత మంది వ్యాపారులుగా, బిల్డర్లుగా ముందుకు వచ్చారు. వారు బాలనగర్, ఫతేనగర్ ప్రాంతాల బీసీ, ఎస్సీ ఓటర్లను ప్రభావితం చేయగలరని అంటున్నారు. 

,సుహాసిని కోసం ఆమె సోదరులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, బాబాయ్ బాలకృష్ణ రంగంలోకి దిగుతారని భావిస్తున్నారు. దానికితోడు, చంద్రబాబు శేర్ లింగంపల్లి, కూకట్ పల్లిల్లోని ఆంధ్ర సెటిలర్లతో మాట్లాడే అవకాశాలున్నాయి.

సంబంధిత వార్తలు

బాబు 'సుహాసిని' వ్యూహం: లోకేష్ కు లైన్ క్లియర్, ఎన్టీఆర్ కు స్పేస్

అక్క గెలుపుకు కృషి చేస్తా,పెదనాన్న లేని లోటు పూడ్చుతా:తారకరత్న

జూ.ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు ప్రచారం చేస్తారు: సుహాసిని

చిచ్చు పెడుతున్న చంద్రబాబు: సుహాసిని పోటీపై కేటీఆర్ వ్యాఖ్యలు

సెటిలర్ల ఓట్లకు గాలం: కేసీఆర్ వ్యూహం ఇదీ

చంద్రబాబును ఓసారి నేను తరిమేశాను, ఇప్పుడు మీరు: కేసీఆర్

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్

వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్

కేటీఆర్‌పై కేసు.. ఎన్నికల సంఘానికి నివేదిక

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

ఎవరు స్వీట్లు పంచుకొంటారో చూద్దాం: కేటీఆర్‌కు ఉత్తమ్ కౌంటర్

కేసీఆర్‌, కేటీఆర్‌పై పోటీ చేసే అభ్యర్థులెవరో తెలుసా?

"ఎంపీనో.. ఎమ్మెల్యేనో మరణిస్తేనే పట్టించుకుంటారా"... కేటీఆర్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఘాటైన ట్వీట్‌

ప్రగతి నివేదన సభ: 15 నిమిషాల్లో కేటీఆర్‌కు చొక్కా కుట్టించిన టైలర్

ట్విట్టర్‌లో కాదు మైదానంలో ఆడదాం రా...: కేటీఆర్‌కు రేవంత్ సవాల్

Follow Us:
Download App:
  • android
  • ios