Asianet News TeluguAsianet News Telugu

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

ద్దిపేట ప్రజలు ఇచ్చిన బలంతోనే తాను తెలంగాణను సాధించినట్టు  తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.

we are committed for farmers welfare says kcr
Author
Hyderabad, First Published Nov 20, 2018, 1:53 PM IST

సిద్దిపేట: సిద్దిపేట ప్రజలు ఇచ్చిన బలంతోనే తాను తెలంగాణను సాధించినట్టు  తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. సిద్దిపేటలో పుట్టినందుకు, ఇక్కడ గెలిచినందుకు హరీష్ రావు  మీకిచ్చిన మాటలను నిలబెట్టుకొన్నట్టు చెప్పారు. ఐకేపీ ఉద్యోగులకు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఐకేపీ సభ్యులను పర్మినెంట్ చేస్తామన్నారు. రేషన్ డీలర్లు నెల రోజుల పాటు దుకాణాలు తెరిచేలా ప్లాన్ చేస్తున్నామని  కేసీఆర్ ప్రకటించారు.

మంగళవారం నాడు సిద్దిపేటలో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల సభలో కేసీఆర్ ప్రసంగించారు. దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా దూసుకుపోతోందన్నారు.సిద్దిపేట నుండి హరీష్ రావు, దుబ్బాక నుండి  రామలింగారెడ్డిలు లక్ష ఓట్ల మెజారిటీతో  విజయం సాధిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

రెండేళ్లలో సిద్దిపేటకు  రైలును తీసుకొస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.  రైతుల జీవితాలు బాగుండాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.రైతులకు 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ ను ఇస్తామని  కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉమ్మడి ఏపీలో  రైతుల బతుకులు ఏ రకంగా  నష్టపోయారో తనకు తెలుసునని కేసీఆర్ చెప్పారు.

రైతుల సంక్షేమం కోసం తాను ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే  ఎకరానికి  రూ.5 వేలు రైతులకు పెట్టుబడి ఇవ్వనున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది లోపుగా  రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

రైతులు పండించిన పంటలను మహిళా సంఘాలు కొనుగోలు చేస్తారని కేసీఆర్ చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో ఐకేపీ ఉద్యోగులు కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఐకేపీ ఉద్యోగులను  పర్మినెంట్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మహిళా సంఘాలే పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నిర్వహిస్తాయనన్నారు.

అంతేకాదు మహిళా సంఘాల ద్వారా తయారు చేసే సరుకులను రేషన్ డీలర్ల ద్వారా విక్రయిస్తామన్నారు. ఈ తరుణంలో  నెల రోజుల పాటు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయన్నారు.

రేషన్ డీలర్లకు వేతనాలు ఇవ్వాలో...  కమీషన్ ఇవ్వాలో ఎన్నికల తర్వాత వారితో చర్చించి నిర్ణయం తీసుకొంటామన్నారు. ఈ విషయమై మంత్రివర్గంలో చర్చిస్తామని ఆయన తెలిపారు.

దేశంలోని అనేక  అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నోరు, కడుపు కట్టుకొని పాలన చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు.  భూ కబ్జాలు, దుర్మార్గాలు, గూండాలు లేరన్నారు. శాంతిభద్రతలు బ్రహ్మండంగా ఉన్నాయని కేసీఆర్ తెలిపారు.

కష్టపడుతున్నందున రాష్ట్రానికి బాగా ఆదాయం వస్తోందన్నారు. ఈ ఆదాయం మేరకు రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు పథకాలను రూపొందిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీ గురించి నేను కొత్తగా చెప్పాల్నా... ఇది సిద్దిపేట అంటూ కేసీఆర్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. 

హరీష్ రావు, రామలింగారెడ్డిలు  లక్ష ఓట్లతో విజయం సాధించాలని కేసీఆర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో  మెదక్ నుండి  కొత్త ప్రభాకర్ రెడ్డి 5 లక్షల ఓట్లతో విజయం సాధిస్తారనే  నమ్మకం కల్గించాలని  కేసీఆర్ కోరారు.

సంబంధిత వార్తలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్

 

Follow Us:
Download App:
  • android
  • ios