Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబును ఓసారి నేను తరిమేశాను, ఇప్పుడు మీరు: కేసీఆర్

చంద్రబాబునాయుడును నేను ఒక్కసారి తరిమేశాను.. కానీ, ఇప్పుడు మీరు చంద్రబాబును తరిమివేయాల్సిన అవసరం ఉందన్నారు

kcr slams on ap chandrababunaidu in adilabad meeting
Author
Khanapur, First Published Nov 22, 2018, 1:35 PM IST

ఖానాపూర్: చంద్రబాబునాయుడును నేను ఒక్కసారి తరిమేశాను.. కానీ, ఇప్పుడు మీరు చంద్రబాబును తరిమివేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన చంద్రబాబు పెత్తనం మరోసారి తెలంగాణపై అవసరమా అని ఆయన ప్రశ్నించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖనాపూర్ లో గురువారం నాడు నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల సభలో  కేసీఆర్ పాల్గొన్నారు. చంద్రబాబునాయుడు చిన్న మనిషా.. పెద్ద మనిషి.. ఏడాది పాటు కేంద్రం, ఆంధ్రప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టారని కేసీఆర్ చెప్పారు. ఎక్కువ కాలం పాటు  హైద్రాబాద్ లోనే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్లాన్ చేసినట్టు చెప్పారు.

కాంగ్రెస్ కు చేతకాక ఆంధ్రకు పోయి చంద్రబాబునాయుడును తెలంగాణకు తీసుకువస్తున్నారని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆంధ్ర చంద్రబాబునాయుడును తీసుకువస్తున్నారని  కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

టీఆర్ఎస్ ఓడిపోతే నాకు వచ్చే  నష్టం లేదు. తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణపై చంద్రబాబు పెత్తనం వస్తే  ఎవరికీ లాభమని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తమ చిల్లర రాజకీయం కోసం చంద్రబాబునాయుడును తెచ్చుకొంటారా అని ప్రశ్నించారు.


ఎన్నికలు వస్తాయి పోతాయి గెలవాల్సింది నాయకులు కాదు.. ప్రజలు గెలవాల్సిన అవసరం ఉందన్నారు.  ఈ ఎన్నికల్లో విచక్షణతో  ఓటు వేయాలని కేసీఆర్ కోరారు.
అనుకొన్న  అభివృద్ధి జరగాలంటే సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. కాంగ్రెస్, టీడీపీల  పాలనలో  ఎంత అభివృద్ధి జరిగింది.... ఈ నాలుగేళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో  బేరీజు వేసుకోవాలన్నారు.

ఈ ఎన్నికల్లో  ఎవర్ని గెలిపించాలో ప్రతి ఇంట్లో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  తెలంగాణ ఏర్పాటైతే  రాష్ట్రం చిమ్మ చీకటి అవుతోందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని ఆయన గుర్తు చేశారు. 

కానీ తెలంగాణలో విద్యుత్ బ్రహ్మండంగా ఇస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడ  రైతులకు 24 గంటలపాటు  తెలంగాణలో మాదిరిగా ఉచితంగా విద్యుత్ ఇవ్వలేదన్నారు.

తెలంగాణలో విద్యుత్ సరఫరా కోసం 12వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు కేసీఆర్ గుర్తు చేశారు.మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ కరెంటు సమస్యలు వస్తాయన్నారు. మళ్లీ టీఆర్ఎస్ ను  గెలిపిస్తే  సంక్షేమ కార్యక్రమాలను మరింత రెట్టింపు చేస్తామన్నారు. ఏజెన్సీ భూములు ఉన్నాయి... ఈ భూముల విషయాల్లో కాంగ్రెస్, టీడీపీలు ఏం చేశాయని ఆయన ప్రశ్నించారు. 

చంద్రబాబునాయుడు చిన్న మనిషా.. పెద్ద మనిషి.. ఏడాది పాటు కేంద్రం, ఆంధ్రప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టారని కేసీఆర్ చెప్పారు. ఎక్కువ కాలం పాటు  హైద్రాబాద్ లోనే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్లాన్ చేసినట్టు చెప్పారు.

కాంగ్రెస్ కు చేతకాక ఆంధ్రకు పోయి చంద్రబాబునాయుడును తెలంగాణకు తీసుకువస్తున్నారని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆంధ్ర చంద్రబాబునాయుడును తీసుకువస్తున్నారని  కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

టీఆర్ఎస్ ఓడిపోతే నాకు వచ్చే  నష్టం లేదు. తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణపై చంద్రబాబు పెత్తనం వస్తే  ఎవరికీ లాభమని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తమ చిల్లర రాజకీయం కోసం చంద్రబాబునాయుడును తెచ్చుకొంటారా అని ప్రశ్నించారు.

చంద్రబాబునాయుడును నేను ఒక్కసారి తరిమేశాను.. కానీ, ఇప్పుడు మీరు చంద్రబాబును తరిమివేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రలో తెలంగాణను కాంగ్రెస్ పార్టీ 1956 లో కలిపింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తు చేశారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కూడ 14 ఏళ్ల పాటు  కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ఆపిందన్నారు.  సర్వేలు చేసుకొని  తెలంగాణ ఇస్తేనే  నాలుగు సీట్లు వస్తాయని భావించారని... అందుకే కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ ఇచ్చిందన్నారు.


సంబంధిత వార్తలు

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్

వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios