నకిరేకల్:  చంద్రబాబునాయుడు రూపంలో  తెలంగాణకు ప్రమాదం ముంచుకొస్తోందన్నారు. తెలంగాణ మీద మళ్లా చంద్రబాబునాయుడు పెత్తనం అవసరమా అని కేసీఆర్ ప్రశ్నించారు.చంద్రబాబునాయుడును మరోసారి భుజాల మీద ఎక్కించుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణకు తీసుకొచ్చారని కేసీఆర్ విమర్శించారు. 


నకిరేకల్‌లో బుధవారం నాడు  నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల సభలో తెలంగాణ అపద్ధర్మ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో  అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు  ఆయన తెలిపారు.

కేసీఆర్‌తో కోట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలకు చేతకాక...దమ్ము లేక చంద్రబాబునాయుడు ప్రాపకం కోసం వెళ్లారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 58 ఏళ్ల పోరాటం తర్వాత లక్షలాది మంది జైళ్లకు పోయి,  వందలాది మంది మృత్యువాత పడి తెలంగాణను సాధించుకొన్నట్టు ఆయన చెప్పారు.

ఏదైనా పని కావాలంటే  అమరావతికి బానిసలు కావాలంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని  కేసీఆర్ ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు పార్టీకి డిపాజిట్లు రాకుండా చేయాలి,  చంద్రబాబును తెలంగాణకు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు చేయాలని  కేసీఆర్  ప్రజలకు సూచించారు.
 

తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబునాయుడు అడ్డుకొంటున్నారని చెప్పారు.14 ఏళ్ల పోరాటం తర్వాత  తెలంగాణ సాధించుకొన్నామని చెప్పారు. 2001లో తెలంగాణ సాధన కోసం ఒంటరిగా బయలు దేరినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలు ప్రత్యక్షంగా చూశారని చెప్పారు. రైతులకు కాంగ్రెస్, టీడీపీలు  అనేక ఇబ్బందులు కల్గించారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో  ఏనాడూ లేని విధంగా రైతులకు ఉచితంగా విద్యుత్ ను సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం కూడ విద్యుత్ ను రైతులకు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ వస్తే చీకటి అవుతోందని  మాజీ సీఎం కిరణ్ కుమార్  రెడ్డి చెప్పారని ఆయన ప్రస్తావిస్తూ తెలంగాణలో  జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారని ఆయన చెప్పారు.


సంబంధిత వార్తలు

రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్

వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్