Asianet News TeluguAsianet News Telugu

సెటిలర్ల ఓట్లకు గాలం: కేసీఆర్ వ్యూహం ఇదీ

తెలంగాణలో  సీమాంధ్రులు (సెటిలర్లు) ఓట్ల కోసం టీఆర్ఎస్‌ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. 

trs plans to attract seemandhra voters
Author
Hyderabad, First Published Nov 23, 2018, 11:42 AM IST


హైదరాబాద్: తెలంగాణలో  సీమాంధ్రులు (సెటిలర్లు) ఓట్ల కోసం టీఆర్ఎస్‌ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. నాలుగున్నర ఏళ్ల తమ పాలనలో సీమాంధ్రులకు రక్షణ కల్పించిన విషయాన్ని టీఆర్ఎస్‌ నేతలు గుర్తు చేస్తున్నారు.  సెటిలర్లతో ఈ నెల 24వ తేదీన భారీ సభను ఏర్పాటు చేస్తున్నారు.ఈ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్ 7వ తేదీన  ఎన్నికలు జరగనున్నాయి.  సుమారు  24  అసెంబ్లీ నియోజకవర్గాల్లో ని పార్టీలు,  అభ్యర్థుల గెలుపు ఓటములపై  సీమాంధ్ర ఓటర్లు ప్రభావితం చేయనున్నారు.  2014 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిందనే  కోపంతో ఏపీ లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటర్లు  తీర్పును ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో  టీడీపీ, బీజేపీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.ఈ కూటమికి 20 అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ముఖ్యంగా గ్రేటర్ హైద్రాబాద్  పరిధిలోని ఎక్కువ అసెంబ్లీ స్థానాలను  బీజేపీ, టీడీపీ కూటమి కైవసం చేసుకొంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో  టీడీపీ బలహీనపడింది. టీడీపికి చెందిన ముఖ్య నేతలు, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఆర్ఎస్‌లో  చేరారు. 

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  హైద్రాబాద్ నుండి కాకుండా అమరావతి నుండి  పరిపాలనను ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో  టీడీపీ ,బీజేపీ కూటమి  తీవ్రంగా నష్టపోయింది. టీఆర్ఎస్‌ రాజకీయంగా  బలపడింది.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో విజయం సాధించిన టీడీపీతో పాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ వైపుకు టీఆర్ఎస్ తిప్పుకొంది. 

హైద్రాబాద్‌తో పాటు, తెలంగాణలో ఉంటున్నవారంతా  తమ వారేననే భరోసాను  కేసీఆర్ కల్పించే ప్రయత్నం చేశారు.  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  టీఆర్ఎస్‌  విజయం సాధించింది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి.  ఈ ఎన్నికల్లో గ్రేటర్ హైద్రాబాద్‌లోని ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాల్లో   సీమాంధ్రుల ఓటర్లు  గెలుపు ఓటములు ప్రభావం చూపుతారు.దీంతో ఈ ఓటర్లను ఆకర్షించేందుకు  టీఆర్ఎస్  వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.

నాలుగున్నర ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో  సీమాంధ్రులకు ఏ రకమైన  సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారనే విషయాన్ని  ఆ పార్టీ నేతలు  విన్పించనున్నారు. ఈ మేరకు ఈ నెల 24వ తేదీన కూకట్‌పల్లిలోని ఎన్ గార్డెన్స్ లో  సీమాంధ్రుల సంఘీభావ సభను  నిర్వహించనున్నారు. ఈ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.

తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే  సీమాంద్రులకు ఇబ్బందులు  జరుగుతాయనే ప్రచారంలో వాస్తవం లేదని సీమాంధ్రుల సంఘీభావ సభ నిర్వహకులు  సత్యనారాయణ, కృష్ణ ప్రసాద్, వాసుదేవ్ లు తెలిపారు. సీమాంధ్రులు స్వచ్చంధంగా ముందుకొచ్చి టీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబును ఓసారి నేను తరిమేశాను, ఇప్పుడు మీరు: కేసీఆర్

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్

వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios