ట్విట్టర్‌లో కాదు మైదానంలో ఆడదాం రా...: కేటీఆర్‌కు రేవంత్ సవాల్

Congress leader Revanth Reddy wishes to minister KTR
Highlights

 కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మంగళవారం నాడు  ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మంగళవారం నాడు  ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
కేటీఆర్‌తో పాటు టీఆర్ఎస్‌ నేతలపై నిప్పులు చెరిగే  రేవంత్ రెడ్డి..... ఆసక్తికరంగా కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అంతేకాదు ట్విట్టర్ కంటే మైదానంలోనే ఆడాలని  మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.   ఈ మేరకు తాను మైదానంలో పుట్‌బాల్ ఆడుతున్న ఫోటో‌ను కూడ ట్విట్టర్ వేదికగా  షేర్ చేశారు.  

 

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును  పురస్కరించుకొని రేవంత్ రెడ్డి  శుభాకాంక్షలు తెలిపినట్టుగానే తెలిపి మంత్రిపై  వంగ్యాస్త్రాలను సంధించారు. టీడీపీలో ఉన్న సమయంలోనూ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడ టీఆర్ఎస్‌ను లక్ష్యంగా చేసుకొని రేవంత్ రెడ్డి  విమర్శలు గుప్పిస్తున్నారు.
 

loader