హైదరాబాద్:  ఐదేళ్ల పాటు మీకు అండగా ఉంటా....  తనను  గెలిపిస్తే ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని కూకట్‌పల్లి నుండి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన సుహాసిని ప్రకటించారు.

శనివారం నాడు కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఆమె  రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానెల్‌తో ఆమె మాట్లాడారు. తాను పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. మా తాతయ్య పెట్టిన పార్టీ. మా నాన్న పనిచేశాడు.   ఈ రోజు పార్టీని మామయ్య నడుపుతున్నాడు.  తమ కుటుంబమంతా ప్రజా సేవలోనే ఉందన్నారు.

 ప్రజా సేవ చేసేందుకే  తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నట్టు  సుహాసిని చెప్పారు. ఎన్టీఆర్ మనమరాలిగా తాను కూకట్‌పల్లి నుండి  పోటీ చేస్తున్న విషయం తెలుసుకొని ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని చెప్పారు.

తాను కూకట్‌పల్లి నుండి  పోటీ చేయడాన్ని తమ కుటుంబం అంతా మద్దతుగా నిలిచిందని చెప్పారు. తన సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు సినిమా షెడ్యూల్  ముందే ఫిక్స్ అయి ఉన్నాయన్నారు. తమ షెడ్యూల్‌లో వీలు చూసుకొని  తనకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారని  సుహాసిని చెప్పారు.ప్రజల దీవెనతో  కూకట్‌పల్లి నుండి విజయం సాధిస్తానని ఆమె ధీమాను వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

చిచ్చు పెడుతున్న చంద్రబాబు: సుహాసిని పోటీపై కేటీఆర్ వ్యాఖ్యలు

సెటిలర్ల ఓట్లకు గాలం: కేసీఆర్ వ్యూహం ఇదీ

చంద్రబాబును ఓసారి నేను తరిమేశాను, ఇప్పుడు మీరు: కేసీఆర్

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్

వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్

కేటీఆర్‌పై కేసు.. ఎన్నికల సంఘానికి నివేదిక

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

ఎవరు స్వీట్లు పంచుకొంటారో చూద్దాం: కేటీఆర్‌కు ఉత్తమ్ కౌంటర్

కేసీఆర్‌, కేటీఆర్‌పై పోటీ చేసే అభ్యర్థులెవరో తెలుసా?

"ఎంపీనో.. ఎమ్మెల్యేనో మరణిస్తేనే పట్టించుకుంటారా"... కేటీఆర్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఘాటైన ట్వీట్‌

ప్రగతి నివేదన సభ: 15 నిమిషాల్లో కేటీఆర్‌కు చొక్కా కుట్టించిన టైలర్

ట్విట్టర్‌లో కాదు మైదానంలో ఆడదాం రా...: కేటీఆర్‌కు రేవంత్ సవాల్