చంద్రబాబు వదల బొమ్మాళీ అంటున్నాడని తెలంగాణ అపద్ధర్మ సీఎం కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

జడ్చర్ల:చంద్రబాబు వదల బొమ్మాళీ అంటున్నాడని తెలంగాణ అపద్ధర్మ సీఎం కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

బుధవారం నాడు ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 35 కేసులు వేశారని చెప్పారు. నాగం జనార్ధన్ రెడ్డితో పాటు పవన్ కుమార్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలు ఈ ప్రాజెక్టుపై కేసులు వేశారన్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి 9 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకొని ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.పాలమూరు జిల్లాను వలస జిల్లాగా మార్చాడని కేసీఆర్ విమర్శించారు. 

మహాకూటమి పేరుతో చంద్రబాబునాయుడు తెలంగాణలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాడని కేసీఆర్ చెప్పారు. పాలమూరు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ కోరారు. తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రే అంటూ కేసీఆర్ చెప్పారు. 

ఉడుముల్లా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. నాలుగేళ్లలో వేల కోట్లతో ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్టు ఆయన చెప్పారు. పాలమూరులో 20 లక్షల ఎకరాలకు నీటిని ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్