హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీలు  ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకొన్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. డిసెంబర్ 11 తర్వాత రాహుల్ గాంధీ వీణ , చంద్రబాబునాయుడు ఫీడేల్ వాయించుకోవాల్సిందేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

శనివారం నాడు జరిగిన కూకట్‌పల్లిలో  జరిగిన సీమాంధ్రుల సభలో  కేటీఆర్  పాల్గొన్నారు.తెలంగాణ వస్తే సీమాంధ్రులను తరిమేస్తారంటూ దుష్ప్రచారం చేశారని కేటీఆర్ చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  టీఆర్ఎస్  ఒంటరిగా విజయం సాధిస్తామని  తాను ఆనాడూ చెప్పినట్టు కేటీఆర్ గుర్తు చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ 100 సీట్లను విజయం సాధిస్తే  చెవి కోసుకొంటానని సీపీఐ నేత  కె. నారాయణ,  ఆనాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి చేసిన  విమర్శలను ఆయన గుర్తు చేశారు. 

కానీ, టీఆర్ఎస్ 99 కార్పోరేషన్లను కైవసం చేసుకొందని కేటీఆర్ గుర్తు చేశారు.కానీ సవాళ్లు చేసిన నారాయణ, రేవంత్ రెడ్డిలు ఎటు వెళ్లారని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేని  నాలుగు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని కేటీఆర్ పీపుల్స్ ఫ్రంట్‌పై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్, టీడీపీలు  ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకొన్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. డిసెంబర్ 11 తర్వాత రాహుల్ గాంధీ వీణ , చంద్రబాబునాయుడు ఫీడేల్ వాయించుకోవాల్సిందేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో  శాంతి భద్రతల సమస్యల తలెత్తలేదన్నారు. శాంతిభద్రతల, విద్యుత్ సరఫరా విషయంలో  టీఆర్ఎస్ సర్కార్ చేసిన కార్యక్రమాలపై ప్రజలు ఆదరించినట్టు చెప్పారు. గత 70 ఏళ్లలో ఏనాడూ లేని విధంగా శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాలేదన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్రులు టీఆర్ఎస్‌కు మద్దతిచ్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కుల,మత ప్రాంతాల పేరుతో ఎనాడూ కూడ టీఆర్ఎస్ రాజకీయాలు చేయలేదన్నారు. 

9 ఏళ్లలో హైద్రాబాద్ ను తానే  నిర్మించినట్టు చంద్రబాబునాయుడు గొప్పలు చెబుతున్నాడన్నారు.  ఇంత పెద్ద హైద్రాబాద్‌ను అభివృద్ధి చేసిన చంద్రబాబునాయుడు అమరావతిని ఎందుకు ఇంకా నిర్మించలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

కూకట్‌పల్లిలో టీడీపీలో ఎవరూ లేరా.. ఎక్కడి నుండి  ఇక్కడికి బరిలోకి దింపి భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పరోక్షంగా సుహాసినిని  టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దింపడంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన అనేది ప్రాంతాల విభజన మాత్రమేనని కేటీఆర్ చెప్పారు.

నందమూరి హరికృష్ణ మరణించిన రోజున నల్గొండ జిల్లా నుండి జగదీష్ రెడ్డి  సంఘటన స్థలానికి వెళ్లి చంద్రబాబునాయుడుతో పాటు హైద్రాబాద్ కు వచ్చారని చెప్పారు. హరికృష్ణ పార్థీవ దేహం హైద్రాబాద్ కు రాగానే తనతో పాటు కేసీఆర్  ఆ కుటుంబసభ్యులను పరామర్శించినట్టు తెలిపారు.

రెండు గంటల పాటు  తాను హరికృష్ణ నివాసం వద్దే ఉన్నట్టు ఆయన గుర్తు చేశారు. రాజకీయ లబ్దికోసం తాము ప్రయత్నించలేదని  ఆయన గుర్తు చేశారు.   ఈ నాలుగేళ్ల  పాటు  తాము  ఉద్వేగాలను రెచ్చగొట్టలేదన్నారు. 
 

సంబంధిత వార్తలు

సెటిలర్ల ఓట్లకు గాలం: కేసీఆర్ వ్యూహం ఇదీ

చంద్రబాబును ఓసారి నేను తరిమేశాను, ఇప్పుడు మీరు: కేసీఆర్

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్

వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్

కేటీఆర్‌పై కేసు.. ఎన్నికల సంఘానికి నివేదిక

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

ఎవరు స్వీట్లు పంచుకొంటారో చూద్దాం: కేటీఆర్‌కు ఉత్తమ్ కౌంటర్

కేసీఆర్‌, కేటీఆర్‌పై పోటీ చేసే అభ్యర్థులెవరో తెలుసా?

"ఎంపీనో.. ఎమ్మెల్యేనో మరణిస్తేనే పట్టించుకుంటారా"... కేటీఆర్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఘాటైన ట్వీట్‌

ప్రగతి నివేదన సభ: 15 నిమిషాల్లో కేటీఆర్‌కు చొక్కా కుట్టించిన టైలర్

ట్విట్టర్‌లో కాదు మైదానంలో ఆడదాం రా...: కేటీఆర్‌కు రేవంత్ సవాల్