Asianet News TeluguAsianet News Telugu

రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్

కాంగ్రెస్, బీజేపీలపై టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనని కేవలం జెండాలు మాత్రమే వేరు అని విమర్శించారు. దేవరకొండలో టీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ కేంద్రంలో ప్రాంతీయ పెత్తనం పెరగాలని ఆకాంక్షించారు. 
 

kcr comments at praja aseervada sabha in devarakonda
Author
Devarakonda, First Published Nov 21, 2018, 3:58 PM IST

దేవరకొండ:కాంగ్రెస్, బీజేపీలపై టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనని కేవలం జెండాలు మాత్రమే వేరు అని విమర్శించారు. దేవరకొండలో టీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ కేంద్రంలో ప్రాంతీయ పెత్తనం పెరగాలని ఆకాంక్షించారు. 

కేంద్రంలో ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరిగితేనే రాష్ట్రాల హక్కులు సాధించుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలన్నారు. తెలంగాణ ఎన్నికల అనంతరం జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాలకు రావాల్సిన హక్కులను సాధించుకుందామని హామీ ఇచ్చారు.  

దేవరకొండ నియోజకవర్గం ఒకప్పుడు కరువుకు పెట్టింది పేరన్న కేసీఆర్ బతుకు దెరువు కోసం వేలాదిమంది వలసలు పోయారని తెలిపారు. పేదరికంతో దేవరకొండ ప్రజలు నలిగిపోయారని కేసీఆర్ గుర్తు చేశారు. దేవరకొండ నియోజకవర్గానికి సాగు తాగు నీరు అందించే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు.

దేవరకొండ నియోజకవర్గంలో2లక్షల ఎకరాలకు సాగునీరందించాలన్నదే తన లక్ష్యమని కేసీఆర్ అన్నారు. దిండి, నక్కల గండి ప్రాజెక్టుల ద్వారా నియోజకవర్గానికి సాగునీరందిస్తానని హామీ ఇచ్చారు. దేవరకొండ అభ్యర్థి రవీంద్రనాయక్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి తమకు మరోసారి అవకాశం ఇవ్వాలన్నారు. 

ఆ తర్వాత దేవరకొండలో కరువు అనేది లేకుండా చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసిందన్నారు. లంబాడీ బిడ్డలు తండాల కోసం 50 ఏళ్లుగా కొట్లాడారని కానీ ఏపార్టీ వారి సమస్యలను పట్టించుకోలేదన్నారు. 

అయితే టీఆర్ఎస్ పార్టీ మాత్రం లంబాడాల సమస్యలు విన్నదని, తండాలను పంచాయితీలుగా గుర్తించిందని స్పష్టం చేశారు. తెలంగాణలో అత్యధిక తండాలను గ్రామ పంచాయితీలుగా దేవరకొండ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేశామన్నారు. సుమారు 85 కొత్త గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

ఇకపోతే ఎస్టీల, ముస్లింల రిజర్వేషన్ల కోసం టీఆర్ఎస్ పార్టీ ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్లపై శాసన సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని అయితే దానికి ప్రధాని మోదీ ఆమోద ముద్ర వెయ్యడం లేదన్నారు. 

రిజర్వేషన్లపై మోదీని 20 సార్లు కలిశానని, 50సార్లు లేఖలు రాశానని అయినా మోదీ స్పందించడం లేదన్నారు. పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. ఎస్టీ, ముస్లింలకు న్యాయం జరగాలంటే రిజర్వేషన్లను పెంచడమేనన్నారు. 

ఎస్టీ, ముస్లింల రిజర్వేషన్లను తానే సాధిస్తానని, కేంద్రం మెడల వంచి సాధించి తీరుతానని చెప్పారు. ప్రధాని మోదీకి హిందూ, ముస్లిం అనే రోగాలున్నాయని అందువల్లే ఆమోదం వెయ్యడం లేదంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. 

ఐక్యరాజ్య సమితి సైతం రైతు బంధు పథకంపై ప్రసంశలు కురిపించిందని కేసీఆర్ తెలిపారు. రైతు భీమాను సైతం కొనియాడిందన్నారు. దేశంలో ఏ ప్రభుత్వాలు ఇలాంటి పథకాలను అమలు చెయ్యడం లేదన్నారు. రాష్ట్రంలో 3వేల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరేలా రైతు బంధు, రైతు భీమా పథకాలను అమలులోకి తీసుకువచ్చామన్నారు. 

ఒకప్పుడు తెలంగాణకు అడ్డుపడ్డ చంద్రబాబు నాయుడు మళ్లీ అవసరమా అంటూ కేసీఆర్ నిలదీశారు. చంద్రబాబును తెలంగాణకు భుజంపై మోసుకొస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న చంద్రబాబును ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. చంద్రబాబుకు, మోసుకొస్తున్న వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలని కేసీఆర్ సూచించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios