ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ టీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. సికింద్రాబాద్ మారేడ్‌పల్లి చౌరస్తాలో టీఆర్ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థి సాయన్నకు మద్ధతుగా మంత్రి కేటీఆర్ గురువారం రాత్రి రోడ్ షో నిర్వహించి ప్రచారం చేశారు.

అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత రోడ్‌షోలకు, సభలకు అనుమతి లేదు. దీనిని గుర్తించిన కంటోన్మెంట్ ఫ్లయింగ్ స్వ్వాడ్ మారేడ్‌పల్లి పోలీసులకు తెలిపారు.

దీనిపై కేటీఆర్‌తో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న తదితరులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 341, 188 సెక్షన్లతో పాటు 67, 21/76 సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈసీకి నివేదిక సమర్పించారు. 
 

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

ఎవరు స్వీట్లు పంచుకొంటారో చూద్దాం: కేటీఆర్‌కు ఉత్తమ్ కౌంటర్

కేసీఆర్‌, కేటీఆర్‌పై పోటీ చేసే అభ్యర్థులెవరో తెలుసా?

"ఎంపీనో.. ఎమ్మెల్యేనో మరణిస్తేనే పట్టించుకుంటారా"... కేటీఆర్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఘాటైన ట్వీట్‌

ప్రగతి నివేదన సభ: 15 నిమిషాల్లో కేటీఆర్‌కు చొక్కా కుట్టించిన టైలర్

ట్విట్టర్‌లో కాదు మైదానంలో ఆడదాం రా...: కేటీఆర్‌కు రేవంత్ సవాల్