హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిని పోటీ దించడం వెనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పక్కా వ్యూహంతో వ్యవహరించినట్లు అర్థమవుతోంది. రాజకీయంగా నందమూరి, నారా కుటుంబాలను స్థిరపరిచే ఆలోచన అందులో ఉన్నట్లు తెలుస్తోంది. 

నందమూరి కుటుంబం తెలంగాణలో, నారా కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిపించడానికి తగిన రాజకీయ వ్యూహ రచన అందులో ఉన్నట్లు తెలుస్తోంది. నందమూరి హరికృష్ణ కుమారుడు కల్యాణ్ రామ్ ను కూకట్ పల్లి నుంచి పోటీకి దించడానికి ఆయన ప్రయత్నించారు. కల్యాణ్ రామ్ అంగీకరించకపోవడంతో కూతురు సుహాసినిని దించారు. 

జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనతో ఉన్నారనేది అందరికీ తెలిసిందే. ఆయన తెలుగుదేశం పార్టీని నడిపించాలనే ఆలోచనతోనే ఉన్నట్లు చెబుతారు. ఈ స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటే తెలంగాణను ఆయనకు వదిలేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సుహాసినిని పోటీకి దించారని అంటున్నారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన తనయుడు నారా లోకేష్ కు పూర్తిగా లైన్ క్లియర్ అవుతుందనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. నందమూరి కుటుంబం నుంచి నారా లోకేష్ కు దానివల్ల ఏ విధమైన ఇబ్బంది ఉండదు.

సుహాసిని పోటీ చేయడం కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లకు ఇష్టం లేదని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఇరువురు కూడా తమ అక్కకు మద్దతు తెలియజేస్తూ ప్రకటన చేశారు. సుహాసినిని పోటీకి దించడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ తనకు వ్యతిరేకంగా పనిచేయడానికి ముందుకు రారని చంద్రబాబు భావించి ఉంటారని అంటున్నారు. 

నారా లోకేష్ ను పార్టీలో ప్రమోట్ చేయడాన్ని నందమూరి కుటుంబం మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. చంద్రబాబు తన కార్యరంగాన్ని పూర్తిగా అమరావతికి మార్చిన తర్వాత తెలంగాణను వదిలేశారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రలో కన్నా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా ఉండేది. 

పార్టీని చేజేతులా పాడు చేసుకున్నామని టీడీపి నేతలు ఆవేదన చెందిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ కు గానీ నారా బ్రాహ్మణికి గానీ అప్పగించాలని వారు చంద్రబాబును కోరుతూ వచ్చారు. అయితే, అందుకు చంద్రబాబు అంగీకరించలేదు. కొన్ని జిల్లాల్లో పార్టీ ఇప్పటికీ బలంగా ఉందని, బలమైన నాయకుడు పార్టీని నడిపిస్తే పుంజుకుంటుందని తెలంగాణ టీడీపి నేతలు చెబుతూ వచ్చారు. 

ఈ స్థితిలోనే పార్టీకి తెలంగాణలో తిరిగి ప్రాణం పోయడానికి, నందమూరి కుటుంబానికి తాను వ్యతిరేకంగా లేనని చాటుకోవడానికి చంద్రబాబు సుహాసినిని పోటీకి దించారని భావిస్తున్నారు. తద్వారా తెలంగాణ పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించాననే సంకేతాలను ఆయన పంపించారు. అదే సమయంలో నందమూరి కుటుంబం తెలంగాణకే పరిమితమైపోతుంది. ఎపిలో నారా కుటుంబానికి ఏ విధమైన ఆటంకాలు ఎదురు కావు. 

అదే సమయంలో ప్రజా కూటమి తెలంగాణలో అధికారంలోకి వస్తే సుహాసినికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. కాంగ్రెసు నాయకుడు సర్వే సత్యనారాయణ ఇప్పటికే ఆ విషయాన్ని చెప్పారు. ప్రజాకూటమి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూకట్‌పల్లి నుంచి విజయం సాధించే నందమూరి సుహాసినికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అక్క గెలుపుకు కృషి చేస్తా,పెదనాన్న లేని లోటు పూడ్చుతా:తారకరత్న

జూ.ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు ప్రచారం చేస్తారు: సుహాసిని

చిచ్చు పెడుతున్న చంద్రబాబు: సుహాసిని పోటీపై కేటీఆర్ వ్యాఖ్యలు

సెటిలర్ల ఓట్లకు గాలం: కేసీఆర్ వ్యూహం ఇదీ

చంద్రబాబును ఓసారి నేను తరిమేశాను, ఇప్పుడు మీరు: కేసీఆర్

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్

వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్

కేటీఆర్‌పై కేసు.. ఎన్నికల సంఘానికి నివేదిక

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

ఎవరు స్వీట్లు పంచుకొంటారో చూద్దాం: కేటీఆర్‌కు ఉత్తమ్ కౌంటర్

కేసీఆర్‌, కేటీఆర్‌పై పోటీ చేసే అభ్యర్థులెవరో తెలుసా?

"ఎంపీనో.. ఎమ్మెల్యేనో మరణిస్తేనే పట్టించుకుంటారా"... కేటీఆర్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఘాటైన ట్వీట్‌

ప్రగతి నివేదన సభ: 15 నిమిషాల్లో కేటీఆర్‌కు చొక్కా కుట్టించిన టైలర్

ట్విట్టర్‌లో కాదు మైదానంలో ఆడదాం రా...: కేటీఆర్‌కు రేవంత్ సవాల్