హుజూర్‌నగర్ ఉపఎన్నికకు అభ్యర్ధిని ఖరారు చేసింది తెలుగుదేశం పార్టీ. మాజీ జడ్పీటీసీ చావా కిరణ్మయిని అభ్యర్ధిగా ప్రకటించిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆమెకు బీఫారాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌లో టీడీపీ గెలుపునకు కార్యకర్తలు, నేతలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న కిరణ్మయిని అభ్యర్ధిగా నిర్ణయించామని పేర్కొన్నారు.

తెలంగాణ అభివృద్దిలో టీడీపీదీ కీలకపాత్రని తమ ప్రభుత్వ చర్యల కారణంగానే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందన్నారు.  కిరణ్మయి మాట్లాడుతూ... హుజూర్‌నగర్ ప్రజలు తన గెలుపునకు సహకరించాలని కోరారు. 

హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి కాంగ్రెసు తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో హుజూర్ నగర్ ఉప ఎన్నికపై తెలుగుదేశం పార్టీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది.

చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తెలంగాణ నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. హుజూర్ నగర్ లో తమ పార్టీ తరఫున అభ్యర్థిని పోటీకి దింపాలని పలువురు నేతలు ఆయనకు సూచించారు. పోటీ చేయడం ద్వారా క్యాడర్ ను నిలుపుకునే ప్రయత్నం చేయాలనేది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది.     

సంబంధిత వార్తలు:

హుజూర్‌నగర్ ఉపఎన్నిక: టీఆర్ఎస్‌కి సీపీఐ మద్ధతుపై ఎల్లుండి నిర్ణయం

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు: సీపీఐ మద్దతుకు టీఆర్ఎస్ యత్నాలు

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు: సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు

హుజూర్‌నగర్ ఉపఎన్నిక: కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్ఎస్‌కి వేసినట్లే.. లక్ష్మణ్ వ్యాఖ్యలు

కేసీఆర్ హుజూర్ నగర్ వ్యూహం: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకాకి

వీకెండ్: హుజూర్ కోసం పోరు, అజరుద్దీన్ తో వివేక్ కు కేటీఆర్ చెక్

2011 బాన్సువాడ నిర్ణయం: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ సై

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఎఫెక్ట్: సర్పంచుల సంఘం అధ్యక్షుడు మిస్సింగ్?

హుజూర్ నగర్ పై చంద్రబాబు మంతనాలు: ఉత్తమ్ కు షాక్?

కోదాడలో చెల్లని పైసా హుజూర్ నగర్ లో చెల్లుతుందా: ఉత్తమ్ పై కర్నె ప్రభాకర్ ధ్వజం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక... బరిలో 251మంది సర్పంచులు

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు షాక్: హుజూర్‌నగర్ బరిలో 30 మంది లాయర్లు

ట్రక్కు లేకపోతే ఉత్తమ్ అప్పుడే ఓడిపోయేవారు: కేటీఆర్

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్ధి ఈమెనే

గెలుపు మనదే,50 వేల మెజారిటీ రావాలి: సైదిరెడ్డితో కేసీఆర్

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి